Shoaib Akhtar on Pakistan Team: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. స్వదేశంలో కూడా గెలవలేని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పర్సనల్ రికార్డుల కోసమే ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారని బాంబు పేల్చారు. పర్సనల్ క్రెడిట్ కోసం ఆడటం వల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పాకిస్తాన్ జట్టును కాపాడడం కష్టమేనని తేల్చి చెప్పారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ దద్దమ్మలే.. పర్సనల్ రికార్డుల కోసమే ఆడి, పాకిస్తాన్ కొంపముంచుతున్నారని మండిపడ్డారు. తాను జట్టులో ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు చాలా కసిగా ఆడేవారని వివరించారు. ప్రత్యర్థిని ఓడించాలని ముఖ్య లక్ష్యంతో ముందుకు సాగారని… దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి అలా లేదని హేళన చేస్తూ మాట్లాడారు. ఎవరి దారి వారిదే అన్నట్లుగా క్రికెటర్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పర్సనల్ రికార్డులు… క్రెడిట్ తమకే రావాలన్న కుట్ర కోణంలో పాకిస్తాన్ క్రికెటర్లు ఆలోచన చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దిగజారుతోందని వ్యాఖ్యానించారు.
దానికి తోడు డ్రెస్సింగ్ రూమ్ లో గ్రూపులుగా డివైడ్ అయి తన్నుకుంటున్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దిగజారుతోందని వెల్లడించారు. ఇలా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి తయారు కావడంతోనే ప్రత్యర్ధులను ఓడించలేకపోతున్నారని తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకు టీం ఇండియాలో ఓడించడంలో పాకిస్తాన్ విఫలం అవుతూ వస్తూనే ఉందని ఆగ్రహించారు. జట్టు కోసం పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని సూచనలు చేశారు. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం మాత్రమే ప్లేయర్లు పనిచేయాలని కోరారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోగా టీమిండియాను ఓడించే శక్తి సాధించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కోటలు బద్దలు కొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ తరుణంలోనే మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.