E-Paper
Advertisement

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!
Advertisement

Amazon Sale: ఇంట్లోనే థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించాలి అనుకుంటున్నారా? అయితే పెద్ద స్క్రీన్‌తో పాటు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే OLED టీవీ మంచి ఆప్షన్. డీప్ బ్లాక్స్, రిచ్ కలర్స్, షార్ప్ డీటెయిల్స్‌తో సాధారణ టీవీలతో పోలిస్తే.. OLED మోడల్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ప్రీమియం డిస్‌ప్లే కావడంతో వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

అయితే ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ ప్రైమ్ బిగ్ డీల్ డేస్ సేల్‌లో ఈ ప్రీమియం టీవీలను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన OLED టీవీలపై భారీ డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌కు, అవసరాలకు సరిపోయే బెస్ట్ OLED టీవీ ఏదో తెలుసుకోవాలంటే ఈ డీల్స్‌పై ఓ లుక్కేయండి.

రోకూ ప్రో సిరీస్ 55 ఇంచ్..

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి OLED టీవీ కావాలనుకునే వారికి ఈ టీవీ బాగా సెట్ అవుతుంది. ఇది 4K డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ధర సుమారు రూ.83,900 కాగా.. ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో రూ.58,700 దాకా లభిస్తోంది. గేమింగ్ ప్రియులకు, అలాగే రోకూ ఓఎస్ వల్ల OTT కంటెంట్ నేరుగా చూడటానికి ఇది చాలా బాగుంటుంది. చీకట్లో కూడా సులువుగా వాడేందుకు దీని బ్యాక్‌లిట్ వాయిస్ రిమోట్ బాగా ఉపయోగపడుతుంది.

Also Read: 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

ఎల్జీ B6 65 ఇంచ్ బండిల్..

Advertisement

కాస్త పెద్ద స్క్రీన్, అలాగే అదిరిపోయే సౌండ్ కోరుకునే వారి కోసం ఎల్జీ సూపర్ కాంబో ఆఫర్ ఇస్తోంది. సాధారణంగా 65 ఇంచుల ఈ టీవీ ధర దాదాపు రూ.1,17,500 ఉంటుంది. సేల్‌లో దీనిని సుమారు రూ.1,09,100కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. దీనితో పాటు ఉచితంగా రూ.12,500 విలువున్న 2.1 ఛానెల్ సౌండ్‌బార్ ఫ్రీగా వస్తుంది. ఈ టీవీలో డాల్బీ విజన్, అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల హోమ్ థియేటర్ ఫీల్ గ్యారెంటీ.

ఎల్జీ B6 77 ఇంచ్ బండిల్..

లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్‌లా మార్చాలనుకుంటే ఈ 77 ఇంచుల మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీని అసలు ధర దాదాపు రూ.1,93,100 వరకు ఉంటుంది. కానీ ఈ సేల్‌లో సుమారు రూ.1,67,900కే లభిస్తోంది. దీనికి కూడా సౌండ్‌బార్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో లేటెస్ట్ ఆల్ఫా 8 ఏఐ ప్రొసెసర్, నాలుగు HDMI 2.1 పోర్టులు ఉన్నాయి. ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ వాడే వారికి ఇది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

గుర్తుంచుకోవాల్సినవి..

ఏదైనా ఆఫర్ ఉందనగానే టక్కున కొనేయడం కంటే కొన్ని విషయాలు ఆలోచించాలి. మీ గది పరిమాణానికి ఏ సైజ్ టీవీ సరిపోతుందో చూసుకోవాలి. ఎల్జీ, రోకూ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్స్ వేర్వేరుగా ఉంటాయి. మీ వాడకానికి ఏది సులభంగా ఉంటుందో చెక్ చేసుకోండి. అలాగే OLED టీవీల్లో బర్న్‌ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇవి చాలా ఏళ్లపాటు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.

Also Read: స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

Tags

Related News

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

అమెజాన్ స్పెషల్ సేల్..ఊహించనంత తక్కువ ధరకే వాటర్ హీటర్లు

వాక్యూమ్ క్లీనర్లపై ఎప్పుడూ చూడని ఆఫర్లు..అస్సలు మిస్సవ్వొద్దు

ఒక్క రీఛార్జ్.. 4 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ బంపరాఫర్!

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×