Vivo X Fold 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. భారతీయ మార్కెట్లోకి ఒకేసారి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసి సంచలనం సృష్టించింది. వీటిలో Vivo X Fold 6, Vivo V80, Vivo S2 FE మోడళ్లు ఉన్నాయి. రోజువారీ వాడకానికి అనువుగా ఉండే ఫోన్ల నుంచి అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ మోడల్ వరకు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం ఫీచర్లు, మెరుగైన డిజైన్లతో వచ్చిన ఈ ఫోన్ల విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివో తీసుకొచ్చిన అత్యంత ప్రిమియం, ఖరీదైన మోడల్ ఈ ఎక్స్ ఫోల్డ్ 6. దీని ధర రూ.2,19,999గా ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. పుస్తకంలా తెరుచుకునే ఈ ఫోల్డబుల్ ఫోన్ లోపల, బయట పెద్ద స్క్రీన్లు ఉంటాయి. ఫోల్డబుల్ ఫోన్లలోనే అతిపెద్దదైన 6,900mah బ్యాటరీని ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7పై ఇది పనిచేస్తుంది. 200 మెగాపిక్సెల్ జైస్ కెమెరాతో పాటు 100ఎక్స్ జూమ్ సపోర్ట్ చేసే టెలిఫోటో లెన్స్ దీని సొంతం.
Also Read: వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!
కెమెరా, వేగానికి ప్రాధాన్యం ఇచ్చే వారి కోసం వివో వి80 ఫోన్ తీసుకొచ్చారు. దీని 8జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.62,999 కాగా, 8జీబీ + 256జీబీ ధర రూ.69,999, అలాగే 8జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. ఇందులో 6.59 అంగుళాల 1.5కే ఆమోలెడ్ డిస్‌ప్లే, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 90వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 7,200mah బ్యాటరీ ఇందులో ఉంది. దీని వెనుక, ముందు భాగాల్లో 50 మెగాపిక్సెల్ జైస్ కెమెరాలు ఉండటం గమనార్హం.
బడ్జెట్ ధరలో శక్తివంతమైన బ్యాటరీ కోరుకునే వారికి వివో ఎస్2 ఎఫ్‌ఈ మంచి ఎంపిక. దీని 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.38,999 కాగా, 8జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.42,999గా ఉంది. ఇందులో 6.83 అంగుళాల స్క్రీన్, డైమెన్సిటీ 7300ఈ ప్రాసెసర్ ఇచ్చారు. ఏకంగా 10,000mah భారీ బ్యాటరీ, 44వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకత. వెనుక 50 మెగాపిక్సెల్, ముందు 32 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి.
వివో ఎక్స్ ఫోల్డ్ 6, వివో వి80 ఫోన్లు అక్టోబర్ 13 నుంచి అమ్మకానికి రానున్నాయి. వీటిని వివో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ప్రముఖ రిటైల్ షాపుల్లో కొనవచ్చు. ఇక వివో ఎస్2 ఎఫ్‌ఈ మోడల్ మాత్రం అక్టోబర్ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
Also Read: రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!