E-Paper
Advertisement

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది
Advertisement

Kapil Dev Warns Vaibhav Sooryavanshi:  టీమిండియాలోకి ఇప్పుడిప్పుడే వచ్చిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ ( Kapil Dev) సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ను లైట్ తీసుకుంటే, వినోద్ కాంబ్లీకి పట్టిన గతే నీకు పడుతుందని అంటూ వైభవ్ కు వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది, ఇలాంటి తరుణంలో దాన్ని సక్రమంగా వాడుకోవాలని కోరారు.

కాంబ్లీ లాగా లైట్ తీసుకుంటే..రోడ్డున పడతావ్

వినోద్ కాంబ్లీ కూడా ఇలాగే ప్రతిభ ఉన్నా, సరైన దారిలో వెళ్లలేదని విమర్శలు చేశారు. దీంతో అతడు రోడ్డున పడ్డాడని గుర్తు చేశారు. వినోద్ కాంబ్లీలాగా కాకుండా, మంచి మార్గంలో  వైభవ్ సూర్యవంశీ నడవాలని కోరారు. కెరీర్ ను లైట్ తీసుకుంటే, వినోద్ కాంబ్లీకి పట్టిన గతే, వైభవ్ సూర్యవంశీకి పడుతుందని హెచ్చరించారు. దీంతో వైభవ్  సూర్యవంశీపై మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..మరో మూడేళ్లు కెరీర్ పై దృష్టి పెట్టు

వైభవ్ సూర్యవంశీకిపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంబ్లీ లాగా లైట్ తీసుకుంటే..రోడ్డున పడతావని వార్నింగ్ ఇచ్చారు. ఈ తరుణంలోనే కెరీర్ ను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వైభవ్ వయస్సు ప్రస్తుతం 15 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. ఇలాంటి తరుణంలో మరో మూడేళ్లు కష్టపడాలని సూచనలు చేశారు. అప్పుడే వైభవ్ కెరీర్ గాడిన పడుతుందని తెలిపారు. ఇప్పటి నుంచే పొడిచేస్తానని, ఓవర్ గా వెళితే, కెరీర్ నాశనమేనని హెచ్చరించారు.  ఇప్పుడే వైభవ్ పై బీసీసీఐ కూడా ఎక్కువ బాధ్యతలు పెట్టకూడదని కోరారు. అతడికి తక్కువ అవకాశాలు ఇస్తూ, మెరుగైన ప్రదర్శన రాబట్టాలని కోరారు.

Advertisement

వినోద్ కాంబ్లీ తాగుడు, ఇతర వ్యాసనాలకు బానిస అయ్యాడని గుర్తు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయని, చెడు పోకడలకు వైభవ్ వెళ్లొద్దని కోరారు. కెరీర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలని కోరారు. అలా ఫోకస్ చేస్తేనే, మరో సచిన్, విరాట్ కోహ్లీ అవుతాడని  కపిల్ దేశ్  ( Kapil Dev) వెల్లడించారు. దీంతో వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  కపిల్ దేవ్ చెప్పినట్టుగానే వినోద్ కాంబ్లీ కూడా తన కెరీర్ ను చేజేతులా పాడు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ లాగా ఎదగాల్సిన అతడు, తాగుడు..ఇతర వ్యసనాలకు అలవాటైయ్యాడు. కెరీర్ ను గాలికొదిలేశాడు. ప్రతిభ ఉన్నప్పటికీ కెరీర్ ను లైట్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు డబ్బులు లేక, ఓల్డ్ ఏజ్ హోం తలదాచుకుంటున్నాడు. అలాంటి పరిస్థితికి వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi) రావొద్దని కపిల్ దేవ్ తాజాగా కోరారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో ఉండ‌డు

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

Big Stories

Advertisement
×