E-Paper
Advertisement

ఇంత కంటే మంచి అవకాశం మళ్లీ రాదు.. రూ.25,000 లోపే Apple iPad 10th జనరేషన్!

ఇంత కంటే మంచి అవకాశం మళ్లీ రాదు.. రూ.25,000 లోపే Apple iPad 10th జనరేషన్!
Advertisement

Apple iPad 10th Gen: సాధారణంగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ 10th జనరేషన్ ఐప్యాడ్‌పై ఊహించని రేంజ్‌లో ఆఫర్ నడుస్తోంది. ఈ క్రమంలో మీరు గనుక కొత్త ఐప్యాడ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇంతకంటే మంచి సమయం రాదనే చెప్పాలి. 64GB వైఫై వేరియంట్‌పై ఏకంగా 30 శాతానికి పైగా తగ్గింపుతో ఈ డీల్ అందుబాటులో ఉంది.

మార్కెట్లో ఈ ఐప్యాడ్ అధికారిక ధర రూ.34,900 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ దీనిని నేరుగా రూ.25,799కే అందిస్తోంది. అంటే దాదాపు 26 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లేదా యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తే ఈ ధర మరింత తగ్గి రూ.24,299కే సొంతం చేసుకోవచ్చు. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పాత డివైజ్‌లపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: WhatsApp Plus వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, ప్రయోజనాలు ఇవే!

ఈ ఐప్యాడ్‌లో 10.9 ఇంచుల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను అందించారు. ఇది వీడియోలు చూడటానికి, చదువుకోవడానికి చాలా బాగుంటుంది. దీనిలోని ఏ14 బయోనిక్ చిప్ వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్‌గా సాగిపోతాయి. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ రోజువారీ అవసరాలకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

Advertisement

ఇందులో వెనుక వైపు 4K రికార్డింగ్ సపోర్ట్ చేసే 12MP కెమెరా, ముందు భాగంలో వీడియో కాల్స్ కోసం 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. వీడియో కాల్స్‌లో మిమ్మల్ని ఎప్పుడూ స్క్రీన్ మధ్యలో ఉంచే ‘సెంటర్ స్టేజ్’ ఫీచర్ దీని ప్రత్యేకత. ఇది ఐప్యాడ్ ఓఎస్‌పై పనిచేస్తుంది. నోట్స్ రాసుకోవడానికి, స్కెచింగ్ చేయడానికి ఆపిల్ పెన్సిల్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ Apple iPad 10th జనరేషన్ యొక్క 7730 mAh బ్యాటరీ.. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 10 గంటల పాటు నిరంతరాయంగా వెబ్ బ్రౌజింగ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. దీంతో పాటు టైప్-సి పోర్ట్, వైఫై 6, బ్లూటూత్ 5.2, మంచి స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. భద్రత కోసం పవర్ బటన్‌పైనే టచ్ ఐడీ ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో యాపిల్ బ్రాండ్ ఐప్యాడ్ కావాలనుకునే వారికి ఈ డీల్ ఒక సువర్ణావకాశం. ఆఫర్ ముగిసేలోపు ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని ఓసారి పరిశీలించవచ్చు.

Also Read: గూగుల్ పిక్సెల్ ఫోన్లలో Android 17 అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి!

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×