E-Paper
Advertisement

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!
Advertisement

TRAI New Rules 2026: ఇంటర్నెట్ పెద్దగా ఉపయోగించకుండా కేవలం కాల్స్, మెసేజ్‌ల కోసం మొబైల్‌ను వాడుతున్నారా? అయినా డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్లకే ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి వస్తోందా? అలాంటి వారికి ఇకపై ఊరట కలగనుంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు డేటాను కలిపి అందించే ప్లాన్లే ఎక్కువగా అందుబాటులో ఉండగా.. ఇకపై ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా చౌకైన వాయిస్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.

కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

ట్రాయ్ తెచ్చిన ఈ కొత్త నిబంధనలతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు బాగా లాభం చేకూరనుంది. సాధారణంగా 30 రోజుల కంటే తక్కువ వ్యాలిడిటీతో వచ్చే ప్రతీ ప్లాన్‌లో డాటా లేకుండా కేవలం మాట్లాడటానికి, మెసేజ్ చేయడానికి వీలుగా ఉండే ప్లాన్లను కూడా కంపెనీలు ఇక ఇవ్వాల్సిందే. డాటా ఉండదు కాబట్టి.. వీటి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఒక ప్రత్యేక లాంగ్ టర్మ్ వాయిస్ ప్లాన్‌ను కూడా తెస్తున్నారు.

Advertisement

Also Read: iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

నెలకోసారి రీఛార్జ్..

మనలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రీఛార్జ్ తేదీలు మారడం. సాధారణంగా 28 రోజుల ప్లాన్ వల్ల ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే తేదీ ముందుకు జరిగిపోతూ ఉంటుంది. దీనికి చెక్ పెడుతూ ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జ్ అయ్యేలా కొత్త ఆప్షన్ తీసుకువస్తున్నారు. ఉదా: మీరు ఒక నెలలో 15వ తేదీన రీఛార్జ్ చేస్తే.. ప్రతీనెలా 15నే రీఛార్జ్ అయ్యేలా ప్లాన్ ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరి లాంటి నెలల్లో ఆ తేదీ లేకపోతే, ఆ నెల చివరి రోజున ఆటోమేటిక్‌గా రీఛార్జ్ వర్తిస్తుంది.

నిబంధనల వెనుక కారణం..

Advertisement

చాలామంది వినియోగదారులు ఇంటర్నెట్ వాడకపోయినా.. ఇంట్లో వైఫై ఉన్నా అనవసరంగా డాటా ప్యాక్‌ల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వయోధికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ట్రాయ్.. ప్రజాభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈ సవరణలు ఖరారు చేసింది. వినియోగదారులకు అనవసర భారం తప్పించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం.

ఎవరికి ప్రయోజనం?

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెద్దవారికి, స్మార్ట్‌ఫోన్ వాడని వారికి బాగా కలిసివస్తుంది. అలాగే ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఎప్పుడూ వైఫై వాడుతూ మొబైల్ డాటాతో పెద్దగా పనిలేని వారికి రీఛార్జ్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మన అవసరానికి తగినట్లుగా మాత్రమే ప్లాన్ ఎంచుకునే వెసులుబాటు రావడం నిజంగా మంచి పరిణామం.

Also Read: ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

Tags

Related News

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×