E-Paper
Advertisement

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!
Advertisement

Flipkart Freedom Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ‘గూగుల్ పిక్సెల్ 10’ స్మార్ట్‌ఫోన్‌పై ఈ సేల్ లో కళ్లుచెదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ. 79,999 కాగా.. ఈ సేల్‌లో రూ. 74,999 కే అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్ రెండింటినీ ఉపయోగిస్తే ఈ ఫోన్‌ను మరింత తక్కువకే పొందే ఛాన్స్ ఉంది.

కళ్లు చెదిరే డిస్కౌంట్లు..

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ లో భాగంగా లాంచ్ ధరపై రూ. 5,000 తగ్గించడంతో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ధర రూ. 74,999కి చేరింది. దీనికి తోడు ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే మరో రూ. 5,000 రాయితీ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 69,999కి తగ్గనుంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఈ ధరను మరింత తగ్గించుకునే వెసులుబాటును ఫ్లిప్ కార్ట్ కల్పించింది. పాత స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా రూ. 59,400 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని పనితీరు, కండిషన్‌పై ఆధారపడి ఇది ఆధారపడి ఉంటుంది.

అలా చేస్తే రూ. 55,949కే ఫోన్!

Advertisement

ఉదాహరణకు మీరు పాత పిక్సెల్ 7 ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే.. దాదాపు రూ. 14,050 వరకు ఎక్స్చేంజ్ విలువ లభించవచ్చు. ఈ ఎక్స్చేంజ్ విలువను రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపితే గూగుల్ పిక్సెల్ 10 ఎఫెక్టివ్ ధర రూ. 55,949కి తగ్గనుంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. దాదాపు రూ.24,000 తక్కువకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మరింత కొత్తవి, ఎక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసే వారికి పిక్సెల్ 10 ఇంకా చౌకగా దక్కే అవకాశం ఉంది. అయితే ప్లిప్ కార్ట్ అందించే ఎక్స్ ఛేంజ్ ధర.. అన్ని స్మార్ట్ ఫోన్లకు ఒకే విధంగా ఉండదన్న విషయాన్ని గుర్తించాలి.

Also Read: డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు

Advertisement

గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల ఓలెడ్ ఆక్టువా (Actua) డిస్‌ప్లేతో రూపొందింది. ఇది గూగుల్ టెన్సర్ G5 (Tensor G5) ప్రొసెసర్‌తో వర్క్ చేస్తుంది ఇందులో 4,970mAh బ్యాటరీ అమర్చారు. అంతేకాకుండా గూగుల్ జెమిని ఏఐ (Gemini AI) ఫీచర్లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10.8 MP టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ వైపు 10.5 MP కెమెరాను అందించారు.

Also Read: రెస్టారెంట్లపై ఉక్కుపాదం.. నగరవాసుల నీరాజనం.. ఈ ఐఏఎస్ రూటే సెపరేటు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×