E-Paper
Advertisement

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!
Advertisement

Haier F17 Washing Machine: ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ హైయర్ భారతదేశంలో తమ సరికొత్త F17 వాషర్ డ్రైయర్ సిరీస్‌ను విడుదల చేసింది. వాషింగ్‌లో అధునాతన ఏఐ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్‌తో వచ్చిన ఈ 12 కేజీల మోడల్ ధర రూ.75,990గా ఉంది. పెద్ద కుటుంబాల అవసరాలకు ఇది సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టోర్లలో, హైయర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంది. ఈ ప్రొడక్ట్‌పై కంపెనీ 4 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీతో పాటు మోటార్‌పై 12 ఏళ్ల వారంటీని అందిస్తోంది.

ఈ వాషింగ్ మెషీన్‌లో ప్రధాన ఆకర్షణ దీని స్మార్ట్ ఫ్లిప్ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్. మన సౌకర్యాన్ని బట్టి ఈ స్క్రీన్ కోణాన్ని 15, 20, 25 డిగ్రీల వరకు మార్చుకోవచ్చు. దీనివల్ల ప్రతిసారీ కిందకు వంగాల్సిన అవసరం లేకుండా, సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఇంట్లో ఉండే పెద్దవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

Also Read: పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

ఇందులోని ఏఐ వాష్ ఫీచర్ బట్టల బరువు, క్లాత్ టైప్‌ను బట్టి సరైన వాషింగ్ సైకిల్‌ను స్వయంగా ఎంపిక చేస్తుంది. కాఫీ, పాలు, నూనె లాంటి 24 రకాల మొండి మరకలను వదిలించేందుకు ప్రత్యేక మోడ్స్ ఉన్నాయి. సర్ఫ్ వృథా కాకుండా స్మార్ట్ డోసింగ్, ఎస్సెన్స్ వాష్ టెక్నాలజీలు పనిచేస్తాయి. బ్యాక్టీరియా, కంటికి కనిపించని పురుగులను వదిలించి, బట్టలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్టీమ్ వాష్ సదుపాయం కూడా ఇచ్చారు.

Advertisement

ఒకే మెషీన్‌లో వాషింగ్, డ్రైయింగ్ రెండూ కావడం వల్ల ఉతికిన బట్టలను వేరేచోట ఆరేయాల్సిన పనిలేదు. వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద డ్రమ్ ఉండటం వల్ల బట్టలు చిక్కుపడవు. డైరెక్ట్ మోషన్ మోటార్ వల్ల శబ్దం, వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటాయి. వైఫై కనెక్టివిటీ ఉండటంతో స్మార్ట్‌ఫోన్ నుంచే ఈ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చు.

Also Read: రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×