E-Paper
Advertisement

రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Moto Pad 70 Pro: మోటరోలా కంపెనీ భారత మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం టాబ్లెట్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ‘మోటో ప్యాడ్ 70 ప్రో’ పేరుతో వస్తున్న ఈ సరికొత్త డివైజ్ జూన్ 27న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. గత ఏడాది వచ్చిన ‘మోటో ప్యాడ్ 60 ప్రో’కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా దీనిని డిజైన్ చేశారు. ఆఫీస్ వర్క్ చేసుకునే వారికి, గేమింగ్ ప్రియులకు, క్రియేటివ్ పనులు చేసే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ల్యాప్‌టాప్ ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

ఈ సరికొత్త మోటో ప్యాడ్ జూన్ 27 నుండి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్, కొన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. దీని ధర భారత మార్కెట్లో సుమారు రూ.35,000 నుండి రూ.45,000 మధ్య ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక వేరియంట్లతో పాటు కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్ కూడా లభించనున్నాయి.

Advertisement

Also Read: అమెజాన్‌లో షాకింగ్ ప్రైస్ డ్రాప్.. రూ.37,000 తగ్గిన Samsung Galaxy S26 Plus ఫోన్ ధర!

సినిమాలు చూసే వారికి, డిజైనింగ్ చేసే వారికి నచ్చేలా దీనిలో 13 ఇంచుల పెద్ద మ్యాక్స్ విజన్ డిస్‌ప్లేను అందించారు. ఇది 3.5K రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నప్పటికీ.. ఈ టాబ్లెట్ కేవలం 6.2 మిమీ మందం, 589 గ్రాముల బరువుతో చాలా తేలికగా, స్టైలిష్ బ్లూ కలర్‌లో చూడముచ్చటగా ఉంటుంది.

Advertisement

ఈ టాబ్లెట్ స్పీడ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. వేడెక్కకుండా ఉండటానికి ప్రత్యేకమైన ఏఐ కూలర్ సిస్టమ్ ఉంది. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ఉండటమే కాకుండా, భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 19 వరకు అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ హామీ ఇచ్చింది.

ఛార్జింగ్ ఎక్కువసేపు రావడానికి ఈ టాబ్లెట్‌లో భారీ 10200mAh బ్యాటరీని అమర్చారు. దీని కోసం బాక్స్‌లోనే 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. జేబీఎల్ స్పీకర్లు, మోటో ఏఐ, గూగుల్ జెమిని వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటికి తోడు నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్స్ గీసుకోవడానికి వీలుగా మోటో పెన్ ప్రో స్టైలస్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్ డిజైన్‌తో కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్.. రేటు మరీ ఇంత తక్కువా!

Related News

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

Big Stories

Advertisement
×