E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Ashwin: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు

Ashwin: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు
Advertisement

Ashwin:  2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) నేపథ్యంలో ఇప్పటినుంచే టీమిండియా జట్టును సిద్ధం చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India). అందుకే గిల్ కు టి20 కెప్టెన్సీ ఇవ్వకుండా.. కేవలం వన్డేలు మాత్రమే అప్పజెప్పారు. గిల్ కెప్టెన్సీ లోనే వన్డే వరల్డ్ కప్ కు వెళ్లనుంది టీం ఇండియా. అయితే ఈ నేపథ్యంలో రోకో కాంబినేషన్ అసలు వన్డే వరల్డ్ కప్ లో ఉంటుందా ? లేదా ? వాళ్ళిద్దరూ లేకుండానే కొత్త ప్లేయర్లను తీసుకుంటారా ? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాళ్ళిద్దరినీ వన్డే వరల్డ్ కప్ లోకి తీసుకుంటామని బీసీసీఐ ఇప్పటివరకు ఎక్కడ వెల్లడించలేదు. దానికి తోడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) అలాగే రోహిత్ శర్మ (Rohit Sharma ) ఏజ్ బార్ అయినట్లు పదే పదే హింట్ ఇస్తున్నారు. ముఖ్యంగా అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ ఇద్దరూ రోకో కాంబినేషన్ను టార్గెట్ చేస్తూ.. వెళ్లగొట్టి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కుట్ర‌లు చేస్తున్నారు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని తుది జట్టులోకి తీసుకుంటారా? లేదా ? అనే అంశంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వెళ్లగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని బాంబు పేల్చారు. వాళ్లు వన్డే వరల్డ్ కప్ అనడం కొంతమందికి ఇష్టం లేదని… అందుకే వాళ్లపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. బీసీసీఐకి కూడా తప్పుడు నివేదికలు ఇస్తూ, కుట్రలకు తెర లేపుతున్నారని అశ్విన్ ఆరోపణలు చేశారు.

నచ్చకపోతే నచ్చలేదని ముఖం ముందే చెప్పండి.. వాళ్లతో దాగుడుమూతలు ఆడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటు లో తీసుకోమని చెబితే, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చేస్తారంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. అనవసరంగా వాళ్లను ఆశపెట్టి, మోసం చేయకూడదని కోరారు. ఇప్పుడే వాళ్లకు ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే.. వరల్డ్ కప్ పై ఫోకస్ చేస్తారని సూచనలు చేశారు. దీనిపై బీసీసీఐ వెంటనే ప్రకటన చేయాలని కోరారు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.

రోహిత్, కోహ్లీ స్థానాల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రంటే?

Advertisement

వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ ను ప్రతిపాదనలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న సెంచరీ కూడా చేశాడు. ఇక అటు ఓపెనర్ గా రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్, లేదా సంజు శాంసన్ పోటీలో ఉంటారని అంటున్నారు. వైభవ్ సూర్య వంశీని టి20లకు పంపించి.. వన్డేల్లోకి సంజూను తీసుకురావాలని గంభీర్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే రోకో కాంబినేషన్ 2027 వన్డే వరల్డ్ కప్ లో ఉండబోదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

 

Related News

Salman Butt: అలాంటి బంతులు వైభ‌వ్ ఎదుర్కొలేడు, 20 ఏళ్ల‌కే కెరీర్ క్లోజ్

నెద‌ర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా విజ‌యం…టీమిండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు ?

ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

IND VS IRE: వైభ‌వ్ ను ఆడించ‌డం దండ‌గే, వాడి కోసం మంచి ప్లేయ‌ర్ల‌ను తొల‌గించ‌డం క‌రెక్ట్ కాదు!

వివాదంలో అంబానీ…ముంబై జ‌ట్టులోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌల‌ర్ !

మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ..ఐర్లాండ్ కెప్టెన్ వార్నింగ్

విరాట్ కోహ్లీకి బిగ్ షాక్‌.. మార్కెట్ లో ఫేక్ వన్8 షూస్ క‌ల‌క‌లం !

Big Stories

×