E-Paper
Advertisement

టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో Pixel 11 Pro XL.. ఊహించని షాక్ ఇచ్చిన గీక్‌బెంచ్ స్కోర్లు!

టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో Pixel 11 Pro XL.. ఊహించని షాక్ ఇచ్చిన గీక్‌బెంచ్ స్కోర్లు!
Advertisement

Pixel 11 Pro XL: గూగుల్ త్వరలో తీసుకరాబోతున్న Pixel 11 Pro XL స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిసారీ కొత్త మోడల్ వచ్చినప్పుడు ప్రాసెసర్ వేగం విపరీతంగా పెరుగుతుందని అభిమానులు ఆశిస్తారు. కానీ, ఈసారి రాబోతున్న ‘టెన్సర్ జి6’ చిప్‌సెట్ మాత్రం అందరినీ కాస్త నిరాశకు గురిచేసేలా ఉంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త చిప్ వల్ల పెద్దగా పెర్ఫార్మెన్స్ పెరుగుదల ఏమీ కనిపించట్లేదు.

గీక్‌బెంచ్ స్కోర్లు ఏం చెప్తున్నాయి?

Pixel 11 Pro XL ఫోన్ గీక్‌బెంచ్ సింగిల్ కోర్ టెస్టింగ్ లో 2,112 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టింగ్ లో 5,196 పాయింట్లు సాధించింది. గతంలో వచ్చిన లీక్స్‌తో పోలిస్తే.. ఈ స్కోర్లు కాస్త బెటర్‌గా ఉన్నప్పటికీ, పాత మోడల్ పిక్సెల్ 10 ప్రోలోని ‘టెన్సర్ జి5’తో పోల్చి చూస్తే పెద్దగా తేడా ఏమీలేదు. కొత్త తరం ప్రాసెసర్ వచ్చినా సరే.. ప్రాసెసింగ్ వేగం మాత్రం పాత దానిలాగే ఉండటం గమనార్హం.

Advertisement

Also Read: Apple Pay వస్తోంది సరే.. మరి UPI పనిచేస్తుందా? ఐఫోన్ యూజర్లు తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఇదే!

కొత్త ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ఇవే:

ఈ లీక్ ద్వారా టెన్సర్ జి6 ప్రాసెసర్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటపడ్డాయి. ఇందులో మొత్తం ఏడు కోర్లు ఉండనున్నాయి. అందులో ఒక కోర్ 4.11GHz, నాలుగు కోర్లు 3.38GHz, మిగిలిన రెండు కోర్లు 2.65GHz వేగంతో పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ఫోన్ లో ఏకంగా 16GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 వెర్షన్, అలాగే గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా పవర్ విఆర్ సి-సిరీస్ జీపీయూని ఇస్తున్నారు.

అభిమానులకు మళ్లీ నిరాశేనా?

Advertisement

ఈసారి గూగుల్ సరికొత్త టెక్నాలజీతో ప్రాసెసర్ తయారీని మార్చబోతోందని, అందుకే పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ లీక్ చూస్తుంటే మళ్లీ పాత కథే పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్న టెస్టింగ్ మాత్రమే కాబట్టి.. ఫోన్ అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అయ్యే అవకాశం లేకపోలేదు.

గూగుల్ అసలు స్ట్రాటజీ వేరే ఉందా?

ఎప్పటిలాగే గూగుల్ కేవలం ప్రాసెసర్ వేగం లేదా బెంచ్ మార్క్ స్కోర్లను మాత్రమే నమ్ముకోదు. బెంచ్ మార్క్ లీడర్‌బోర్డ్‌లో మొదటి స్థానంలో నిలవడం కంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే ఉండే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచర్లపైనే గూగుల్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. కాబట్టి మార్కెట్లోకి వచ్చాక ఈ కొత్త పిక్సెల్ యూజర్లకు ఎలా అనిపిస్తుందో వేచి చూడాలి.

Also Read: అఫీషియల్ లాంచ్ కంటే ముందే లీక్.. Xiaomi 18 Pro, Redmi 17 సిరీస్ రిలీజ్ డేట్స్ ఇవే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×