E-Paper
Advertisement

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఉక్కపోతకు చుక్కలు చూపించే.. టాప్-5 కూలర్లు ఇవే!

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఉక్కపోతకు చుక్కలు చూపించే.. టాప్-5 కూలర్లు ఇవే!
Advertisement

Humid Coolers: ఎండ తీవ్రతకు తోడు గాలిలో తేమ శాతం (హ్యూమిడిటీ) ఎక్కువగా ఉంటే ఉక్కపోత అల్లాడిస్తుంది. ప్రతీ ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఈ సమస్యను అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాతావరణంలో ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉక్కపోతకు చెక్ పెట్టే కూలర్లు సైతం కొన్ని మార్కెట్లో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఆ కూలర్లు ఏవి? తేమ వాతావరణంలో అవి ఎలా పనిచేస్తాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

తేమ వాతావరణంలో కూలర్ల పనితీరు

సాధారణంగా ఎయిర్ కూలర్లు పొడి వాతావరణంలో (Dry Weather) అద్భుతంగా పనిచేస్తాయి. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు త్వరగా ఆవిరి కాకపోవడం వల్ల వీటి కూలింగ్ సామర్థ్యం సహజంగానే కొంత తగ్గుతుంది. అయితే ఐస్ ఛాంబర్ ఉన్న కూలర్లు, గాలిని ఎక్కువ దూరం వరకు ప్రసారం చేయగల (ఎయిర్ త్రో) మోడళ్లు ఈ ఇబ్బందిని కొంతవరకు అధిగమించగలవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అలాంటి కూలర్లపై లుక్కేయండి.

బజాజ్ డీఎమ్‌హెచ్ 90 నియో (90L)

Advertisement

ఈ కూలర్ పెద్ద గదులకు సరిగ్గా సరిపోతుంది. 90 అడుగుల దూరం వరకు చల్లగాలిని ఇది ప్రసారం చేయగలదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో యాంటీ-బ్యాక్టీరియల్ హనీకూంబ్ ప్యాడ్స్, ఐస్ ఛాంబర్ ఉన్నాయి. ఉక్కపోత సమయంలో ఐస్ ముక్కలు వేస్తే చల్లదనం పెరిగి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీనిపై 3 ఏళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.

క్రాంప్టన్ ఓజోన్ నియో (95L)

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ కూలర్.. ఉక్కపోతను సమర్థవంతంగా తగ్గిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలోని హనీకూంబ్ ప్యాడ్స్.. ఎక్కువసేపు చల్లదనాన్ని నిలిపి ఉంచుతాయని పేర్కొంటున్నాయి. 4 వే ఎయిర్ డిఫ్లెక్షన్, ఎవర్‌లాస్ట్ పంప్ ఈ కూలర్ ప్రత్యేకతగా చెబుతున్నారు.

హింద్‌వేర్ కాలిస్టో (105L)

Advertisement

ఈ కూలర్ ఉడ్‌వూల్ (గడ్డి) ప్యాడ్స్‌తో రూపొందింది. భారీ నీటి సామర్థ్యం, పవర్‌ఫుల్ ఎయిర్ డెలివరీ, ఇన్వర్టర్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. తేమ వాతావరణంలో ఈ కూలర్ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ (40L)

ఇది చిన్న సైజు గదులకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. హనీకూంబ్ ప్యాడ్స్, కొలాప్సిబుల్ లూవర్స్ దీని ప్రధాన ఫీచర్లు.

సింఫనీ డైట్ 12T (12L)

పొడవైన టవర్ కూలర్ ను కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. చిన్న గదులు లేదా ఆఫీస్ క్యాబిన్‌లకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిని సెట్ చేసేందుకు ఎక్కువ స్పేస్ కూడా అవసరం ఉండదు.

Also Read: అమెజాన్‌లో దుమ్మురేపుతున్న టాప్ 5 TCL QLED టీవీలు ఇవే..థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

కొనేముందు ఇది గుర్తుపెట్టుకోండి..

నివసించే ప్రాంతంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఐస్ ఛాంబర్ ఉన్న డెజర్ట్ కూలర్లను ఎంచుకోవడం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. హనీకూంబ్ ప్యాడ్స్ ఉన్న కూలర్లు తేమ వాతావరణంలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని స్పష్టం చేస్తున్నారు. చిన్న గది అయితే స్మాల్ సైజ్, టవర్ కూలర్లు సరిపోతాయని హితవు పలుకుతున్నారు. అయితే కూలర్ వాడేటప్పుడు గదిలో క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఉక్కపోతను తగ్గించి గదిని కూలర్లు చల్లబరుస్తాయని వివరిస్తున్నారు.

Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేలలోపు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×