E-Paper
Advertisement

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!
Advertisement

Netflix Recharge Plans: దేశంలో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరుగుతుండటంతో మెుబైల్ యూజర్లు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ పై మెుగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఫ్రీ కాల్స్ తో పాటు 5G డేటా, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్న ప్లాన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్, వీఐలో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ యాక్సెస్ తో వచ్చిన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ను ఈ కథనంలో చూద్దాం.

జియో రూ. 1,299 ప్లాన్

జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ (Netflix Mobile) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

జియో రూ. 1,799 ప్లాన్

Advertisement

ప్రతీ రోజూ అధిక డేటా కావాలనుకునేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇందులోనూ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తారు. దీని ద్వారా మొబైల్, టాబ్లెట్ మాత్రమే కాకుండా టీవీలో కూడా HD క్వాలిటీతో ఓటీటీ కంటెంట్ చూడవచ్చు.

ఎయిర్ టెల్ రూ. 598 ప్లాన్

దేశంలో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చిన అతి చౌకైన ప్లాన్లలో ఇది మెుదటి స్థానంలో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్‌తో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఎయిర్ టెల్ రూ. 1,729 ప్లాన్

Advertisement

నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారికోసం ఎయిర్ టెల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటాయి.

Also Read: సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!

వీఐ రూ. 1,599 ప్లాన్

వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాల్స్ తో పాటు మొబైల్ లేదా టీవీలో వీక్షించేందుకు వీలుగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

Also Read: పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!

Tags

Related News

ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా iPhone 17.. Galaxy S26 Ultraకు 4వ స్థానం!

POCO X8 సిరీస్ లాంచ్‌కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో X8 Power 5G!

బస్సు ఎప్పుడు వస్తుంది? రైలు టైమింగ్ ఏంటి? ఈ Apple Mapsలోనే తెలుసుకోవచ్చు!

Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

పోకీమాన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. గూగుల్ కొత్త ఫిట్‌బిట్ వచ్చేసిందోచ్!

ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..

రోబో వ్యాక్యూమ్‌తో భార్య ఎఫైర్ బట్టబయలు.. రూ.15 లక్షలు గెలిచి.. చివరికి జైలు పాలైన భర్త!

జురాసిక్ పార్క్ తరహాలో.. డైనోసార్లను తిరిగి సృష్టించొచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!

Big Stories

Advertisement
×