E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మీరు వాడుతున్న పవర్ బ్యాంక్ సేఫేనా? ల్యాబ్ టెస్టులో సక్సెస్‌ఫుల్‌గా పాసైన ఆ 5 మోడల్స్ ఇవే!

మీరు వాడుతున్న పవర్ బ్యాంక్ సేఫేనా? ల్యాబ్ టెస్టులో సక్సెస్‌ఫుల్‌గా పాసైన ఆ 5 మోడల్స్ ఇవే!
Advertisement

Best Power Banks: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేనిదే ఏ ఒక్క పని జరగడం లేదు. కానీ, అవసరమైన సమయంలో ఛార్జింగ్ అయిపోతే వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అందుకే మన దగ్గర ఒక మంచి పవర్ బ్యాంక్ ఉండటం చాలా ముఖ్యం. మార్కెట్లో వందలాది మోడల్స్ ఉన్నప్పటికీ.. ల్యాబ్‌లో రకరకాలుగా టెస్ట్ చేసి, రోజువారీ వాడకంలో బెస్ట్‌గా నిలిచిన కొన్ని పవర్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Anker Nano 10,000 mAh

పవర్ బ్యాంక్ అనగానే చాలామందికి పెద్దగా, బరువుగా ఉండే డివైజ్‌లు గుర్తొస్తాయి. కానీ ఈ పవర్ బ్యాంక్ మాత్రం చాలా చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ట్రావెలింగ్ చేసేవారికి ఇదొక అద్భుతమైన ఆప్షన్. దీనిలో పాత, కొత్త డివైజ్‌‌ల కోసం యూఎస్‌బీ-ఏ, యూఎస్‌బీ-సీ పోర్టులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, దీనికి ఇన్‌బిల్ట్‌గా ఒక టైప్-సీ కేబుల్ వస్తుంది. కాబట్టి విడిగా వైర్లు పట్టుకెళ్లాల్సిన తలనొప్పి ఉండదు. రూ.2,500 ధరలో లభించే ఈ పవర్ బ్యాంక్.. రోజంతా ఫోన్‌ను వాడుకోవడానికి బెస్ట్ ఛాయిస్.

Cuktech 15 Air

Advertisement

స్పీడ్‌గా ఛార్జింగ్ ఎక్కే పవర్ బ్యాంక్ కావాలంటే దీని గురించే చెప్పుకోవాలి. సాధారణ పవర్ బ్యాంకుల కంటే ఇది చాలా పల్చగా, కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉంటుంది. దీనిలో 3 పోర్టులు ఉన్నాయి. ఒకే సమయంలో ఇది లాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ఇతర చిన్న డివైజ్‌లను ఛార్జ్ చేయగలదు. ప్రయాణాల్లో ఆఫీస్ వర్క్ చేసుకునేవారికి, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: ఫ్రిడ్జ్‌లో A4 సైజు పేపర్ పెడితే ఏమౌతుందో తెలుసా? కరెంట్ బిల్లు బాదుడుకు బ్రేక్ వేసే సింపుల్ ట్రిక్!

Baseus EnerCore CR11

Advertisement

చాలామంది పవర్ బ్యాంక్ తీసుకుంటారు కానీ, కేబుల్ మర్చిపోతుంటారు. లేదా ఆ పొడవాటి వైర్లు చిక్కులు పడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారి కోసం డిజైన్ చేసిందే ఈ మోడల్. దీనిలో దాదాపు రెండున్నర అడుగుల పొడవైన కేబుల్ ఉంటుంది. మనకు కావలసినంత పొడవుకు లాక్కుని వాడుకోవచ్చు. అలాగే పని అయిపోయాక అది దానంతట అదే లోపలికి వెళ్లిపోతుంది. దీని మెకానిజం చాలా స్మూత్‌గా ఉంటుంది.

BMX SolidSafe 10K

సాధారణంగా పవర్ బ్యాంకులలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీల వల్ల కొన్నిసార్లు వేడెక్కడం లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ పవర్ బ్యాంక్ సరికొత్త ‘సాలిడ్-స్టేట్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో ఎలాంటి ప్రమాదకర ద్రవాలు ఉండవు కాబట్టి.. ఇది చాలా సురక్షితమైనది. అంతేకాదు, సాధారణ బ్యాటరీలతో పోలిస్తే ఇవి చాలా కాలం మన్నికగా వస్తాయి. సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది పర్ఫెక్ట్.

Ugreen Nexode 20,000mAh 130W

ఎక్కువ రోజులు ప్రయాణాలు చేసేవారికి, ఎక్కువ గ్యాడ్జెట్లు వాడేవారికి.. భారీ కెపాసిటీ ఉన్న ఈ పవర్ బ్యాంక్ కావాల్సిందే. ఇది ఫోన్‌ను నాలుగైదు సార్లు, అలాగే లాప్‌టాప్‌ను కూడా పూర్తిగా ఛార్జ్ చేయగలదు. కొంచెం బరువుగా అనిపించినప్పటికీ, విమాన ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి ఇది పూర్తిగా అనుమతించదగినది. పవర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకునేవారికి ఇదొక పవర్‌హౌస్ లాంటిది.

Also Read: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? ఈ 5 స్టెప్స్‌తో కార్ సెక్యూరిటీ కెమెరాగా మార్చేయండి!

Related News

Samsung నుంచి సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. ఎలా పనిచేస్తాయో లీక్ చేసిన కంపానియన్ యాప్!

ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!

చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!

వైర్లతో పనిలేదు.. అమెజాన్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

దొంగలు, చోరీలకు చెక్ పెట్టాలా? వైర్డ్ vs వైర్‌లెస్.. ఏ CCTV పవర్ఫుల్?

ఇల్లే ఇక సినిమా హాల్.. బేస్ అంటే ఇదబ్బా!

Big Stories

×