Wet and Dry Vacuum Cleaners 2026: వర్షాకాలం వచ్చిందంటే.. చాలు, చల్లటి వాతావరణంతో.. పాటు ఇంట్లోకి వచ్చే బురద, తడి.. ఇబ్బందిని కలిగిస్తాయి . అయితే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు కాళ్లు లేదా కిటికీల గుండా ఇంట్లోకి మట్టి, నీరు చేరి ఇల్లు అస్తవ్యస్తంగా మారుతుంది. సాధారణ చీపుర్లు లేదా మాప్‌లతో దీన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, వర్షాకాలపు బురదను క్షణాల్లో తొలగించడానికి సహాయపడే.. అద్భుతమైన 5 వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు , ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఇళ్లలోని నేలలు బురదమయం కావడం సర్వసాధారణం. కేవలం పొడి చెత్తను మాత్రమే పీల్చుకునే.. సాధారణ వాక్యూమ్ క్లీనర్లు ఇలాంటి తడి, బురద నేలలకు పనిచేయవు. ఇక్కడే ‘వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్లు’ మనకు ఎంతగానో సహాయ పడతాయి. ఇవి ఇంట్లోని దుమ్ముతో పాటు నీటిని, మొండి బురదను కూడా ఇట్టే పీల్చుకుని శుభ్రం చేస్తాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 మోడల్స్..
చిన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈ ఇనాల్సా వాక్యూమ్ క్లీనర్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇది 1200W శక్తివంతమైన మోటార్, 17 kPa బలమైన సక్షన్ పవర్ కలిగి ఉంది. దీని 10 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ తడి , పొడి చెత్త రెండింటిని ఈజీగా సేకరిస్తుంది. అంతేకాకుండా .. ఇందులో బ్లోవర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ.3,599 వరకు ఉంది.
హోం అప్లయన్సెస్‌లో ఎంతో నమ్మకమైన ఎరేకా ఫోర్బ్స్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ హెవీ డ్యూటీ క్లీనర్ వర్షాకాలానికి పర్ఫెక్ట్. ఇది 22 kPa హై పవర్ సక్షన్ , 20 లీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తో వస్తుంది. ఇళ్లలో.. పేరుకుపోయే బురదను, నీటి ప్రవాహాలను ఇది క్షణాల్లో క్లీన్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.6,699 గా ఉంది.
తక్కువ టైంలో ఎక్కువ పని చేసే అగారో ఏస్ అద్భుతమైన మోడల్. ఇది 1600 వాట్ల పవర్ ఫుల్ మోటార్ , 21.5 kPa సక్షన్ పవర్ కలిగి ఉంది. 21 లీటర్ల పెద్ద ట్యాంక్ కెపాసిటీ ఉండటం వల్ల ఎక్కువ సార్లు మురికిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 6,699 వರೆకు లభిస్తోంది.
సెంట్ టెక్నాలజీతో తయారైన కెంట్ వోర్టెక్స్ ప్రో వాక్యూమ్ క్లీనర్ 1200W పవర్ , 20 లీటర్ల కెపాసిటీతో వస్తుంది.దీని సైక్లోನಿక్ టెక్నాలజీ , హెపా ఫిల్టర్ గాలిలోని హానికరమైన అలర్జీ కారకాలు కూడా తొలగిపోతాయి. దీని ధర సుమారు రూ. 5,999 వరకు ఉంటుంది.
Also Read: ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!
జర్మన్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో.. తయారైన కార్చర్ డబ్ల్యూడీ 3 ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించింది. ఇది తక్కువ కరెంట్ ను వాడుతూ చాలా బాగా పని చేస్తుంది. దీని బలమైన సక్షన్ పవర్ వర్షాకాలంలో.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో అగ్రగామిగా నిలుస్తుంది. దీని ధర సుమారు రూ. 5,599 వరకు ఉంది.
వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడానికి ఈ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ అవసరాలు , బడ్జెట్ కు తగిన మోడల్ ను ఎంచుకుని మీ ఇల్లు మెరిసేలా చేసుకోండి!