E-Paper
Advertisement

కొనుగోలుదారులకు షాక్.. టీవీఎస్ ఆర్బిటర్ ధర పెంపు!

కొనుగోలుదారులకు షాక్.. టీవీఎస్ ఆర్బిటర్ ధర పెంపు!
Advertisement

TVS Orbiter Price Hike: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారికి TVS కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్బిటర్ V1, V2 రెండు వేరియంట్ల ధరలను పెంచింది. అయితే, ధర పెంపు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్ లు, బెనిఫిట్స్ ను బట్టి కొత్త ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

ఏ వెరియంట్ ధర ఎంత పెరిగిందంటే?

TVS ఆర్బిటర్ V1 ధర గరిష్టంగా రూ.3,700 వరకు పెరిగింది. ఢిల్లీలో గతంలో రూ.87,800గా ఉన్న ఈ మోడల్ దర ఇప్పుడు  రూ.91,500కి చేరింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా V1 ధర రూ.3,700 పెరిగింది. ఈ రాష్ట్రాల్లో గతంలో రూ.91,800గా ఉన్న ధర ఇప్పుడు రూ.95,500కి చేరింది. అయితే మహారాష్ట్రలో మాత్రం V1 ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అక్కడ ఈ స్కూటర్ ధర రూ.91,800గానే కొనసాగుతోంది.

V2పై కూడా ధర పెంపు

Advertisement

TVS ఆర్బిటర్ V2 వేరియంట్ ధరను కూడా కంపెనీ పెంచింది. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడుల్లో ఈ వేరియంట్ ధర రూ.3,900 పెరిగింది. మహారాష్ట్రలో మాత్రం రూ.4,000 పెరిగింది. ధరల పెంపు తర్వాత రాష్ట్రాన్ని బట్టి TVS ఆర్బిటర్ V2 ప్రభావవంతమైన ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.06 లక్షల నుంచి రూ.1.13 లక్షల మధ్య ఉంది. అయితే, ఇవి రాష్ట్ర   పన్నులు, ప్రోత్సాహకాలను బట్టి మారే అవకాశం ఉంటుంది.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ధరలు పెంచినప్పటికీ TVS ఆర్బిటర్‌ లో ఎలాంటి కొత్త మెకానికల్ అప్‌ డేట్, ఫీచర్ మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. అంటే అదనపు ఫీచర్లు లేకుండానే ధరలు పెరిగాయి.

రెండు బ్యాటరీ ఆప్షన్లు

TVS ఆర్బిటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఇందులో V1 మోడల్ 1.8kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుంది. మరోవైపు V2 వేరియంట్‌లో పెద్ద 3.1kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 158 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి V2 వేరియంట్ మరింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.  రెండు వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 68 కిలోమీటర్లుగా ఉంది. వీటిలో ఎకో, సిటీ అనే రెండు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోయేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. తాజాగా ధరలు పెరగడంతో కొత్తగా స్కూటర్ కొనాలనుకునే వారు తమ బడ్జెట్‌ను మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాల వారీగా ధరల్లో తేడా ఉండటంతో కొనుగోలు చేసే ముందు స్థానికంగా అందుబాటులో ఉన్న ధరను తెలుసుకోవడం మంచిది.

Advertisement

Read Also: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్‌లోకి అడుగు పెట్టేదెప్పుడంటే?

Tags

Related News

ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!

Y43 మైక్రో SUV To ఎలక్ట్రిక్ MPV.. మారుతి వస్తున్న 4 క్రేజీ యుటిలిటీ వెహికల్స్ ఇవే!

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు.. థార్ రాక్స్‌ పై ఏకంగా రూ.1.20 లక్షల తగ్గింపు!

మహీంద్రా BE 07 ఇంటీరియర్ లీక్.. వారెవ్వా.. ఏముంది గురూ!

2027 నాటికి 10 లక్షల కనెక్టెడ్ కార్లు.. హ్యుందాయ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?

విన్ ఫాస్ట్ మ్యాక్సీ స్కూటర్ కు పేటెంట్.. స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్!

జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్‌!

Big Stories

Advertisement
×