Varuna Yagam: రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం పడకుండా.. రైతుల కరువు తీర్చేలా వర్షాలు కురవాలని, సాగునీటి ప్రాజెక్టులు నిండి.. రైతన్నల మోముల్లో చిరునవ్వులు చూడాలనే సదుద్దేశంతో.. తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ ఒడ్డున నిర్వహించిన వరుణయాగం అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసింది. ఈ విశేష యాగంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణాహుతి విశేష హోమాల మధ్య సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
అత్యంత వైభవంగా వరుణయాగం..
ఈ పవిత్ర యాగ వేడుకల్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన యాగానికి సంబంధించిన వివిధ పూజా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు, పండితుల వేద మంత్రాల నడుమ సాగర్ గడ్డపై జరిగిన ఈ వరుణయాగం అత్యంత వైభవంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యారు.
Also Read: నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు
ముగిసిన వరుణయాగం..
వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలో త్వరలోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని, భూములు తడిసి.. ధాన్య సంపద వెల్లివిరుస్తుందని, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటాయని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. ఉన్నారు. మొత్తానికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ వరుణయాగం దిగ్విజయంగా ముగిసింది.