E-Paper
Advertisement

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!
Advertisement

BSNL Freedom 2.0: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త రీఛార్జ్ ఆఫర్‌ను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. రూ. 1 కే ఉచిత సిమ్ కనెక్షన్‌తో పాటు ఉచిత కాలింగ్, డేటా ఆఫర్ చేసే ‘ఫ్రీడమ్ 2.0’ ప్రమోషనల్ ఫస్ట్ రీఛార్జ్ కూపన్ (FRC) అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ ప్లాన్‌కు లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని సంస్థ దీన్ని పొడిగించింది.

 ‘ఫ్రీడమ్ 2.0’ బెనిఫిట్స్..

పునరుద్ధరించిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద కొత్త వినియోగదారులకు ప్రతిరోజూ 1GB డేటా లభిస్తుంది. దీనితో పాటు ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఆఫర్ వ్యాలిడిటీ 24 రోజులు. అంటే, 24 రోజుల కాలంలో వినియోగదారులు మొత్తంగా 24GB డేటాను, 2,400 SMSలను రూపాయికే పొందే ఛాన్స్ పొందొచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్ బెనిఫిట్స్ ను ధ్రువీకరించడం గమనార్హం.

ఎవరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది?

Advertisement

ఈ రూపాయి ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్ పాత వినియోగదారులకు వర్తించదు. ఇది కేవలం కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి ఉద్దేశించిన ఫస్ట్ రీఛార్జ్ కూపన్. కాబట్టి సాధారణ వినియోగదారులు లేదా ప్రస్తుతం ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు తమ నంబర్లకు రూ. 1 తో రీఛార్జ్ చేసుకోవడానికి వీలుండదు. కొత్త కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియలో భాగంగా.. ఈ ప్రమోషనల్ స్కీమ్ కింద సిమ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

గతంతో పోలిస్తే ప్రస్తుత ఆఫర్‌లో మార్పులు!

గతంలో వచ్చిన రూ. 1 ప్లాన్‌కు ప్రస్తుత ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్‌కు మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి. మునుపటి వెర్షన్‌లో రోజుకు 2GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 60GB డేటా లభించేది. అయితే ప్రస్తుత ఫ్రీడమ్ 2.0 ప్లాన్‌లో ప్రతిరోజూ వచ్చే డేటాను 1GBకి, వ్యాలిడిటీని 24 రోజులకు కుదించారు. అయినప్పటికీ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSల ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!

ఈ ఆఫర్ ఎప్పటివరకూ?

ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమైన రూ.1 ఆఫర్ ను ఈ ‘ఫ్రీడమ్ 2.0’ పేరుతో అక్టోబర్ 12 వరకూ బీఎస్ఎన్ఎల్ పొడిగించింది. ఈ ప్లాన్ పొందాలనుకునే కొత్త యూజర్లు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 1800-180-1503 ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు సూచించాయి.

Also Read: అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

Tags

Related News

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!

రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!

బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?

Big Stories

Advertisement
×