E-Paper
Advertisement

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Freedom 2.0: కొత్తగా సిమ్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్న మెుబైల్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ (BSNL) అదిరిపోయే ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫ్రీడమ్ 2.0’ (Freedom 2.0) పేరుతో తీసుకొచ్చిన ఈ స్పెషల్ స్కీమ్ కింద కేవలం రూ. 1 చెల్లించి కొత్త సిమ్ ను తీసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ బెనిఫిట్స్ సైతం పొందొచ్చని బీఎస్ఎన్ఎన్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని.. బీఎస్ఎన్ఎల్ సిమ్ కావాల్సిన వారు త్వరితగతిన సిమ్ తీసుకోవాలని సూచించింది.

‘ఫ్రీడమ్ 2.0’ (Freedom 2.0) ఆఫర్ కింద రూ. 1కే సిమ్ తోపాటు 24 వ్యాలిడిటీతో బెనిఫిట్స్ సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. రోజుకు 1GB హై-స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు యూజర్లకు లభించనున్నాయి. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (Vi) నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారాలనుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ ఎంతో ఉపయోగకరంగా మారనుందని టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Also Read: వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

Advertisement

ఫ్రీడమ్ 2.0 ఆఫర్ ను నవంబర్ 11 నుంచి బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 2027 ఫిబ్రవరి 8 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవాలనే కస్టమర్లు గడువు ముగియకముందే ఈ ప్రమోషనల్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే రూ. 1కే సిమ్, రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read: డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

Tags

Related News

రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

రూ.749కే ‘హామర్ వేవ్’బ్లూటూత్ స్పీకర్..ఫీచర్లు చూస్తే అస్సలు వదలరు!

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్

తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

బిగ్,బోల్డ్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ లాంచ్..పూర్తి ఫీచర్లివే!

ప్రైస్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ,ఈ ఇయర్ యూత్ మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌వాచ్ ఇదే!

రూ.30 వేలలోపు బెస్ట్ 4K క్యూఎల్ఈడీ టీవీ ఇదే..ఫీచర్లు చూస్తే షాకవుతారు!

Big Stories

Advertisement
×