Keep original electronic boxes: ఈ రోజుల్లో మార్కెట్లోకి రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు,టీవీలు, ల్యాప్ టాప్‌లు ఇలా కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కొన్నా మొదట మనకు కనిపించేది ప్యాకింగ్ బాక్స్ ఏ కదా..చాలా మంది ఆ బాక్స్‌ను చూడగానే చింపి చెత్తలో పడేస్తారు. కానీ..టెక్ నిపుణులు మాత్రం కొత్త ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు వచ్చే ఒరిజినల్ బాక్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే పడేయకూడదని సలహా ఇస్తున్నారు. ఆ డబ్బాలను దాచుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం కొన్న స్మార్ట్ ఫోన్ .. లేదా ల్యాప్ టాప్‌ను కొద్ది రోజుల వాడిన తర్వాత కొత్త మోడల్‌కు అప్‌డేట్ అయ్యేందుకు అమ్మేస్తుంటాం. అలాంటప్పుడు వస్తువుతో .. పాటు దాని ఒరిజినల్ బాక్స్ కూడా ఇస్తే కస్టమర్లు చాలా ఇష్ట పడతారు. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఫోన్ల ధరలు చెక్ చేస్తే.. బాక్స్‌తో ఉన్న ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు.. రూ.30,000 పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్‌ను ఏడాది తర్వాత అమ్మాలనుకుంటే.. ఒరిజినల్ బాక్స్ ఉంటే అదనంగా మరో రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. అదే బాక్స్ లేకపోతే డీలర్లు ధర బాగా తగ్గిస్తుంటారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే.. సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తుంది. చాలా కంపెనీలు రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ సమయంలో.. ఒరిజినల్ బాక్స్ లేదా అందులోని.. సీరియల్ నంబర్ స్టిక్కర్‌ను అడుగుతుంటాయి. బాక్స్ సేఫ్‌గా ఉంటే.. ఇన్వాయిస్ బిల్లుతో పాటు దానిని పోల్చి చూసుకోవడం టెక్నీషియన్లకు ఈజీ అవుతుంది. అలాగే విడిభాగాల వివరాలు కూడా అందులోనే స్పష్టంగా ఉంటాయి.
మనం ఎప్పుడైనా ఇల్లు మరేటప్పుడు టీవీలు, గాజు స్క్రీన్లు ఉన్న మానిటర్లు, స్పీకర్లు వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్స్ పగిలిపోయే.. ప్రమాదం ఉంటుంది. వాటి ఒరిజినల్ బాక్సులలో.. పర్‌ఫెక్ట్ కుషనింగ్ ఉంటుంది. కాబట్టి.. ఆ బాక్సులలో.. పెట్టి ప్యాక్ చేస్తే.. ఎంత దూరం ప్రయాణించినా మీ గాడ్జెట్లకు ఎలాంటి డ్యామేజ్ కాదు. ఒక వేళ మీరు ఒరిజినల్ బాక్సులు పడేస్తే.. ప్రత్యేకంగా బాక్సులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీని కోసం మార్కెట్లో రూ. 200 నుంచి రూ. 500 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
Also Read: మీ ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడూ కొత్త వాటిలాగే మెరవాలంటే..వాటిపై ఉన్న సింబల్స్ మిస్టరీ తెలియాల్సిందే!
కొత్త డివైజ్‌లతో పాటు వచ్చే.. ఛార్జింగ్ కేబుల్స్, యూజర్ మాన్యువల్ బుక్లెట్లు, ఎక్స్‌ట్రా సిమ్ ఎజెక్టర్ పిన్స్ వంటి చిన్న చిన్న వస్తువులను.. పదే పదే పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ ఒరిజినల్ బాక్సులను సేఫ్‌గా.. ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే, ఈ యాక్సెసరీలన్నీ ఎప్పటికీ సేఫ్ గా ఒకే చోట ఉంటాయి.
అందుకే ఇప్పటి నుంచి మీరు ఏ కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్నా సరే, దాని బాక్స్‌ను వెంటనే పడేయకండి. మీ ఇంట్లో లేదా అటకపై ఒక మూలన వాటిని ఉంచడి. చిన్న చిన్న విషయాలు మనకు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక నష్టాల నుంచి కాపాడతాయి.