E-Paper
Advertisement

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..ఈ 4 రకాల మెసేజ్‌లతో సర్వం కోల్పోతారు జాగ్రత్త!

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..ఈ 4 రకాల మెసేజ్‌లతో సర్వం కోల్పోతారు జాగ్రత్త!
Advertisement

Dangerous whatsapp messages: ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను మోసాలకు వేదికగా మారుస్తున్నారు. రోజు వారీ జీవితంలో మనకు వచ్చే కొన్ని ఆకర్షణీయమైన మెసేజ్‌లు లేదా లింక్‌లపై క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్  క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన 4 వాట్సాప్ మెసేజ్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1.”మీకు భారీ లాటరీ / ఫ్రీ గిఫ్ట్ వచ్చింది”:

చాలా మందికి వాట్సాప్‌లో “మీకు రూ.1 లక్ష లేదా లగ్జరీ కార్ లాటరీ తగిలింది” అంటూ మెసేజ్‌లు వస్తుంటాయి. కొన్ని ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల పేర్లు లేదా ఫెస్టివల్ ఆఫర్ల పేరుతో ఫ్రీ గిఫ్ట్‌లు ఇస్తామని లింకులు పంపుతుంటారు.ఆ ఉత్సాహంతో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే, అది మాల్వేర్ లేదా ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లిస్తుంది. అక్కడ మీ పర్సనల్ వివరాలు అడిగి, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 500 నుంచి రూ.5,000 వరకు డిమాండ్ చేసి మోసం చేస్తారు.

2.”పార్ట్ టైమ్ జాబ్ – రోజుకు రూ. 5,000 “:

Advertisement

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మోసం ఇది.”ఇంట్లో కూర్చునే రోజుకు వేల రూపాయలు సంపాదించొచ్చు, యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే చాలు” అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తుంటాయి. నమ్మి ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే.. మొదట చిన్న టాస్క్‌లు ఇచ్చి డబ్బులు వేస్తారు. ఆ తర్వాత నమ్మకం కుదిరాక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయమంటారు.అలా రూ.50,000 నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పూర్తిగా మోసం చేస్తారు.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

3.”వాట్సాప్ గోల్డ్ లేదా కస్టమ్ థీమ్స్ “:

Advertisement

అధికారిక వాట్సాప్ కాకుండా అదనపు ఫీచర్లు ఉంటాయంటూ ‘WhatsApp Gold’ లేదా ‘Custom Pink/Black WhatsApp’ డౌన్‌లోడ్ చేసుకోమని థర్డ్-పార్టీ లింకులు వస్తుంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఇవి పూర్తిగా హ్యాకర్లు సృష్టించిన మాల్వేర్ అప్లికేషన్లు. ఈ యాప్స్ మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అయితే.. మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు, బ్యాంక్ ఓటీపీలు అన్నీ హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. దీని వల్ల పర్సనల్ డేటా హ్యాక్ అవుతుంది.

4. “బ్యాంక్ అకౌంట్ బ్లాక్  / కేవైసీ అప్‌డేట్ “:

మీ బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని, వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయాలని లేదా కరెంట్ బిల్లు చెల్లించకపోతే కట్ చేస్తామంటూ వాట్సాప్‌లో కొన్ని బెదిరింపు మెసేజ్‌లు వస్తుంటాయి. భయంతో ఆ లింక్ మీద క్లిక్ చేసి యూపీఐ పిన్ లేదా బ్యాంక్ వివరాలు ఎంటర్ చేశామా, క్షణాల్లో బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ జీరో అయిపోతాయి. బ్యాంకులు ఎప్పుడూ వాట్సాప్ ద్వారా పర్సనల్ వివరాలు లేదా ఓటీపీలు అడగవనే విషయం గుర్తుంచుకోవాలి.

Related News

20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!

పాత స్నేక్ గేమ్‌తో కొత్త Nokia 3210 4G ఫోన్.. ఆఫర్ ధర చూస్తే అస్సలు వదలరు!

సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?

జస్ట్ రూ.6 వేలకే అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్.. ప్రైమ్ యూజర్లకు గోల్డెన్ ఛాన్స్ భయ్యా!

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!

Big Stories

Advertisement
×