E-Paper
Advertisement

పాత స్నేక్ గేమ్‌తో కొత్త Nokia 3210 4G ఫోన్.. ఆఫర్ ధర చూస్తే అస్సలు వదలరు!

పాత స్నేక్ గేమ్‌తో కొత్త Nokia 3210 4G ఫోన్.. ఆఫర్ ధర చూస్తే అస్సలు వదలరు!
Advertisement

Nokia 3210 4G: సోషల్ మీడియా హడావుడికి, నిమిషానికోసారి మోగే మెసేజ్ నోటిఫికేషన్లకు కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నారా? అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఓ మంచి బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపిన ఐకానిక్ మోడల్ నోకియా 3210.. ఇప్పుడు 4G వెర్షన్‌లో మళ్లీ అందుబాటులో ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ క్లాసిక్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. HMD తమ అధికారిక వెబ్‌సైట్‌లో నోకియా 3210 4G ధరను ఏకంగా రూ.1,000 తగ్గించింది.

ఇప్పటివరకు రూ.5,000 పైమాటే ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.4,299కే అందుబాటులో ఉంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఇది నిజంగా మంచి డీల్. ఒకేసారి మొత్తం డబ్బులు కట్టడం కష్టమనుకుంటే నెలవారీ EMI సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.716 నుంచి EMIలు ప్రారంభమవుతాయి. యూపీఐ లేదా బ్యాంకు కార్డులతో సులభంగా పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: జస్ట్ రూ.6 వేలకే అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్.. ప్రైమ్ యూజర్లకు గోల్డెన్ ఛాన్స్ భయ్యా!

పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ ఫోన్ డిజైన్ ఉంది. ఇందులో 2.4 అంగుళాల స్క్రీన్, నొక్కుకోవడానికి వీలుగా ఉండే బటన్ల కీప్యాడ్ ఇచ్చారు. ఫోన్ వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనితో సాధారణ ఫోటోలు తీసుకోవచ్చు. ఇది క్లాసిక్ డిజైన్ అయినప్పటికీ వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్, ఎమ్‌పీ3 ప్లేయర్, మన చిన్ననాటి ఫేవరెట్ స్నేక్ గేమ్ వంటివి ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

Advertisement

ఈ రోజుల్లో ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా, ఇందులో 1450mAh రీమూవబుల్ బ్యాటరీని ఇచ్చారు. ఇది సుమారు 10 గంటల టాక్‌టైమ్‌ను ఇస్తుంది. అంతేకాదు ఈ కాలానికి తగ్గట్టు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్ రావడం విశేషం. డ్యూయల్ సిమ్, 4G కనెక్టివిటీ ఉండటంతో కాల్స్ మాట్లాడటానికి, స్పష్టమైన నెట్‌వర్క్ పొందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

పాటలు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఇందులో MicroSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వై2కే గోల్డ్, గ్రంజ్ బ్లాక్, స్క్యూబా బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. చేతిలో హాయిగా ఇమిడిపోయే ఫోన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Also Read: సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?

Tags

Related News

YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..ఈ 4 రకాల మెసేజ్‌లతో సర్వం కోల్పోతారు జాగ్రత్త!

సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?

జస్ట్ రూ.6 వేలకే అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్.. ప్రైమ్ యూజర్లకు గోల్డెన్ ఛాన్స్ భయ్యా!

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×