E-Paper
Advertisement

బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!

బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!
Advertisement

US Birth Tourism Rules Explained: అమెరికా వెళ్లి అక్కడే బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం పొందేలా చేసే బర్త్ టూరిజంపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించే నెట్‌వర్క్‌ లపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త వీసా నియంత్రణ విధానాన్ని ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.

బర్త్ టూరిజం అంటే ఏంటి?

ఒక దేశానికి ప్రధానంగా అక్కడే ప్రసవం చేయాలనే ఉద్దేశంతో వెళ్లడాన్ని సాధారణంగా బర్త్ టూరిజం అంటారు. అమెరికా విషయంలో కొందరు విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటారని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఇంకొంతమంది మెరుగైన వైద్య సదుపాయాల కోసం కూడా విదేశాల్లో ప్రసవాన్ని ఎంచుకుంటారు. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ప్రధానంగా కమర్షియల్ బర్త్ టూరిజం వ్యవస్థలపై దృష్టి పెట్టింది.

ఈ కొత్త రూల్స్ ఎవరి కోసం?

Advertisement

కొత్త విధానం కేవలం అమెరికాకు వెళ్లే గర్భిణులపైనే కాకుండా, బర్త్ టూరిజాన్ని ఒక వ్యాపారంగా నిర్వహించే వ్యక్తులు, సంస్థలపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో బర్త్ టూరిజం సంస్థల యజమానులు, నిర్వాహకులు, మేనేజర్లు, వీసా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడానికి వ్యక్తులకు శిక్షణ ఇచ్చే మధ్యవర్తులు ఉన్నారు. అలాగే ఇలాంటి ప్రయాణాలకు ఉద్దేశపూర్వకంగా సహకరించే విదేశీ వైద్య సేవలందించేవారు, ఇతర సహాయకులు కూడా కొత్త వీసా పరిమితుల పరిధిలోకి రావచ్చని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

వీసా దరఖాస్తుల్లో మోసమే కీలక అంశం!

అమెరికా ప్రభుత్వం ప్రధానంగా మరో అంశాన్ని ప్రస్తావిస్తోంది. బర్త్ టూరిజం నెట్‌ వర్క్‌ లు తమ కస్టమర్లకు వీసా దరఖాస్తుల్లో అసలు ప్రయాణ ఉద్దేశాన్ని దాచాలని, తప్పుడు వివరాలు ఇవ్వాలని సూచిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలు అమెరికా వీసా ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని రూబియో వెల్లడించారు. కొన్ని నెట్‌ వర్క్‌ లు తమ సర్వీసుల కోసం వేలాది డాలర్లు వసూలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఎంతమంది బర్త్ టూరిస్టులు వస్తున్నారు?

Advertisement

అమెరికాలో బర్త్ టూరిజం కోసం ప్రత్యేకంగా వచ్చే మహిళల సంఖ్యను కచ్చితంగా చూపించే ప్రభుత్వ గణాంకాలు లేవు. అయితే, అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, 2024లో విదేశీ చిరునామాలు కలిగిన తల్లులకు అమెరికాలో సుమారు 9,500 మంది శిశువులు జన్మించారు. అయితే, ఈ సంఖ్యను పూర్తిగా బర్త్ టూరిజంగా పరిగణించలేం. ఎందుకంటే విదేశీ చిరునామా ఉన్న ప్రతి తల్లి అమెరికాకు కేవలం ప్రసవం కోసమే వచ్చిందని చెప్పలేం.

అమెరికా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోంది?

అమెరికా ప్రభుత్వం చెబుతున్న కారణాలు ప్రధానంగా మూడు. వీసా వ్యవస్థలో మోసాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడం, అమెరికా పౌరసత్వ వ్యవస్థను రక్షించడం. ఈ చర్యల ద్వారా బర్త్ టూరిజాన్ని ఒక వ్యాపారంగా మార్చి, అమెరికా వీసా నిబంధనలను తప్పించుకునే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా తాజా నిర్ణయం సాధారణంగా విదేశాల్లో ప్రసవం చేయాలనుకునే ప్రతి వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న చర్యగా కాకుండా, వీసా మోసం, కమర్షియల్ బర్త్ టూరిజం నెట్‌ వర్క్‌ లు, వాటికి సహకరించే వ్యవస్థలపై కఠిన చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్న విధానంగా కనిపిస్తోంది.

Read Also: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. మూడు కోచ్‌ల కిటికీలు ధ్వంసం!

Tags

Related News

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!

భారతీయులకు ఉచిత వీసా ఇస్తున్న మలేషియా.. కానీ ఉద్యోగం చేయాలంటే ఈ కండీషన్స్ తప్పనిసరి

దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!

రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

ఏంటీ ఈ బుల్లి పాకెట్ వెనుక.. 150 ఏళ్ల చరిత్ర ఉందా? పైగా కాయిన్స్ కోసం కాదా!

రైల్వే బోర్డులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? ఆశ్చర్యపరిచే నిజాలు!

Big Stories

Advertisement
×