Airtel Prepaid Plans 2026: ఈ మధ్య కాలంలో నెట్‌వర్క్ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ బాగా మారిపోతున్నాయి. మన దేశంలో అత్యధికంగా వాడే ఎయిర్‌టెల్ కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో చాలా మార్పులు చేసింది. కొన్ని పాత ప్లాన్లను తొలగించి, మరికొన్నింటిలో మార్పులు తీసుకొచ్చింది. ఈ వివరాలన్నీ వినియోగదారులకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది.
ఎయిర్‌టెల్‌లో ఒకప్పుడు తక్కువ ధరకు లభించిన అన్‌లిమిటెడ్ ప్లాన్ రూ.249 ఉండేది. అది రూ.299కి మారి, ఇప్పుడు రూ.349కి చేరింది. తక్కువ బడ్జెట్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా కోరుకునే వారికి ఇదే ఆరంభ ప్లాన్‌గా మారింది. రీఛార్జ్ చేసుకునే ముందు కొత్త ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
నెలకు సరిపడా డేటా కావాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్ కొన్ని ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.399 ప్లాన్‌లో రోజువారీ పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా లభిస్తుంది. ఇక రూ.449 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ద్వారా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ లాంటి అదనపు ప్రయోజనాలు ఉచితంగా వస్తాయి.
Also Read: శాంసంగ్ నుంచి మరో సూపర్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్, కొత్త డిజైన్ చూశారా?
పదే పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా 84 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్ సాధారణ డేటాతో వస్తే.. రూ.979 ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఏడాది ప్లాన్ కావాలనుకునే వారికి రూ.3,999 కింద రోజుకు 2.5GB డేటా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తాయి.
విదేశాలకు వెళ్లే వారి కోసం ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను అందిస్తోంది. రూ.648 నుండి రూ.2,998 పరిధిలో లభించే ప్లాన్లు దాదాపు 180 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తాయి. విమానాల్లో ప్రయాణించేటప్పుడు వాడేందుకు రూ.196 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక డేటా ప్యాక్స్ కూడా ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐల కోసం రూ.4,000తో ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులో ఉంది.
ఇవి మాత్రమే కాకుండా.. ఇంట్లో వైఫై కావాలనుకుంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరిట రూ.499 నుండి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. అయితే టెలికాం కంపెనీలు ప్లాన్లను తరచూ మారుస్తుంటాయి కాబట్టి.. రీఛార్జ్ చేసే ముందు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: ఉన్నట్టుండి iPhone 17 ధరలు పెంచనున్న యాపిల్.. కారణం ఏంటో తెలుసా?