Google Pixel 11 Pro Fold: గూగుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడో అని ఎదురుచూస్తున్న పిక్సెల్ 11 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడింది. ఈసారి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేయకుండా గూగుల్ సంస్థ స్వయంగా Pixel 11 Pro Fold ఫోన్ డిజైన్‌ను ముందే రివీల్ చేసేసింది. తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక చిన్న టీజర్ వీడియోను పోస్ట్ చేస్తూ.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా చూపించింది.
ఆగస్టు 12న న్యూయార్క్ వేదికగా జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో ఈ పిక్సల్ 11 సిరీస్ ఫోన్లు అధికారికంగా విడుదల కానున్నాయి. భారతదేశంలో మాత్రం ఆగస్టు 13న ఈ ఫోన్లను పరిచయం చేయనున్నారు. అయితే గ్లోబల్ లాంచ్ జరిగే ఆగస్టు 12 నుంచే ఈ కొత్త ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అవుతాయని గూగుల్ స్పష్టం చేసింది.
టీజర్‌లో చూసిన దాని ప్రకారం.. ఈసారి Google Pixel 11 Pro Fold ఫోన్ పాత మోడల్స్ కంటే కాస్త సన్నగా, బరువు తక్కువగా ఉండేలా కనిపిస్తోంది. వెనుకవైపు కెమెరా మాడ్యూల్ మునుపటి లాగే ఉన్నప్పటికీ.. కెమెరాల మధ్య కొత్తగా ‘పిక్సల్ గ్లో’ లైట్‌ను జత చేసినట్లు తెలుస్తోంది. శాంసంగ్ లాంటి ఇతర కంపెనీలు ఫోన్లను మరింత సన్నగా చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. గూగుల్ మాత్రం కాస్త బరువు ఉన్నప్పటికీ ఫోన్ గట్టితనానికి, మన్నికకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
Also Read: బాస్కెట్‌బాల్ లవర్స్ కోసం Pixel Watch 5.. కొత్త ఎడిషన్ గ్యాడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందా?
ఈ పిక్సల్ 11 సిరీస్ ఫోన్లలో గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ జి6 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అలాగే ఫోల్డబుల్ మోడల్‌లో 4,800Mah బ్యాటరీని అందించవచ్చు. అయితే ఫీచర్ల పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా.. ఈసారి పిక్సల్ ఫోన్ల ధరలు కాస్త భారీగానే పెరిగే అవకాశముందని గూగుల్ ప్రతినిధుల మాటలను బట్టి తెలుస్తోంది.
కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా.. ఈ వేడుకలో గూగుల్ పిక్సల్ వాచ్ 5ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు మొదటిసారిగా ఒక కొత్త ట్రాకర్ డివైజ్‌ను కూడా గూగుల్ పరిచయం చేయవచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ ఆగస్టు 12న గూగుల్ నుంచి టెక్ ప్రపంచానికి పెద్ద విందే లభించనుంది.
Also Read: అమెజాన్ సేల్‌లో బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.10,000 తగ్గిన Samsung Galaxy A56 5G ధర!