E-Paper
Advertisement

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!
Advertisement

Vivo X300 FE: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘వివో X300 FE’ మోడల్‌కు సంబంధించి కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 12GB ర్యామ్‌ వేరియంట్లలో మాత్రమే లభించిన ఈ ఫోన్.. ఇప్పుడు కొత్తగా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.

అయితే మెమరీ, స్టోరేజ్ విడిభాగాల ధరలు పెరగడంతో ఇటీవల పాత వేరియంట్ల ధరలను కంపెనీ పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వినియోగదారులకు కాస్త అందుబాటు ధరలో ఉంచేందుకు వివో ఈ కొత్త ఎంట్రీ లెవెల్ మోడల్‌ను పరిచయం చేసింది.

Advertisement

కొత్తగా వచ్చిన 8GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ.84,999గా ఉంది. ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు లేదా UPI ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా 24 నెలల నో-కాస్ట్ EMI, పాత ఫోన్‌పై 10 శాతం అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read: షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

Advertisement

ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కాగా.. 12GB + 256GB వేరియంట్ ధర రూ.89,999 ఉండగా, టాప్ మోడల్ 12GB + 512GB ధర రూ.99,999గా ఉంది. ఇది లైలాక్ పర్పల్, నోయిర్ బ్లాక్, అర్భన్ ఆలివ్ రంగుల్లో లభిస్తుంది.

Vivo X300 FE ఫోన్‌లో 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. నీరు, ధూళి నుండి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్‌లతో రావడం విశేషం. దీంతో ఫోన్ చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ గేమింగ్‌కు, మల్టీ టాస్కింగ్‌కు చాలా బాగుంటుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

ఈ Vivo X300 FE ఫోన్‌లో 6,500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్లిమ్‌గా, తేలికగా ఉండే ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది.

Also Read: యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

Tags

Related News

OnePlus 12 యూజర్లు ఆ ఒక్క అప్‌డేట్ చేయొద్దు.. చేస్తే ఫోన్ డెడ్ అవ్వడం ఖాయం!

రూ.35,000 బడ్జెట్‌లో నెక్ట్స్ లెవెల్ ఫోన్.. Realme P4s లీక్డ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

రూ.1,899కే..అద్భుతమైన జ్యూసర్ మిక్సర్, ఫుల్ రివ్యూ ఇదిగో!

కొత్త లుక్‌లోకి Instagram.. వర్డ్‌మార్క్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?

రియల్‌మీ టీవీపై భారీగా డిస్కౌంట్..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు

స్మూత్ డిస్‌ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్‌లోకి వచ్చేసింది!

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు..ఇంత కంటే బెస్ట్ మోడల్ ఉండదు తెలుసా ?

ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్ము లేపనున్న Poco M8x 5G.. లాంచ్‌కు ముందే లుక్స్ లీక్!

Big Stories

Advertisement
×