E-Paper
Advertisement

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!
Advertisement

Dharmapuri Arvind: బోధన్‌లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్‌రావుల వద్ద రాజకీయం నేర్చుకుని చివరకు వారికే కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవర్తన దావూద్ ఇబ్రహీం కంటే ప్రమాదకరంగా మారిందని తీవ్ర స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఫామ్‌హౌస్ లెక్కలు, అంకాపూర్ ఆరోపణలు

Advertisement

ఆదర్శ గ్రామం అంటే అంకాపూర్ కాదని, కేసీఆర్ ఫామ్‌హౌస్ అని ఎద్దేవా చేశారు. దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో ఎకరానికి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అల్లం పంట ద్వారానే ఎకరానికి రూ.15 లక్షలు ఆర్జిస్తున్నప్పుడు, ఆ లాభసాటి పంటల రహస్యాన్ని సామాన్య రైతులకు ఎందుకు నేర్పించలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్ మేనేజర్ జాంగీర్‌ను విచారిస్తే కేసీఆర్ అసలు ఆదాయ లెక్కలన్నీ బయటపడతాయన్నారు. అంకాపూర్ రైతులెవరైనా ఎకరానికి కోటి రూపాయల ఆదాయం చూపుతూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా అని నిలదీస్తూ.. కేసీఆర్ లెక్కలు చెక్ చేసుకుంటే అసలు విషయాలు తేలుతాయన్నారు.

నిధుల మళ్లింపు, పార్టీలో పదవుల పంచాయితీ

Advertisement

2014లో కేవలం లక్ష రూపాయల రుణమాఫీ చేసి, పదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఆయుష్మాన్ భారత్ నిధులను మళ్లించి లక్ష కోట్లను నీళ్లపాలు చేశారని మండిపడ్డారు.

ఫామ్‌హౌస్ సీక్రెట్ లీక్!

మరోవైపు బిఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులు తమ వర్గాలకు మంత్రి పదవుల జాబితాలు సిద్ధం చేసుకుంటున్నారని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఈ లెక్కలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కూడా బిఆర్ఎస్ పేరుతో తానే సీఎం అన్నట్లు వ్యవహరిస్తూ పదవులు పంచుతున్నారని అరవింద్ ఎద్దేవా చేశారు.

Also Read: కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

Tags

Related News

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

Big Stories

Advertisement
×