Local Quota: తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్ నిబంధనలు అమలు చేయాలని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. స్థానికంగా నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధనను సవాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలొ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అన్న నిబంధన రూల్ ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీఎస్ నరసింహ కొట్టివేసారు. MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలవుతుందని ఆ రూల్స్ పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల్లో లోకల్ కోటా ప్రయోజనం పొందాలంటే కచ్చితంగా ప్రవేశ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణలో విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేయడం తప్పనిసరి అని సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో విద్యార్థులందరికి లోకల్ కోటాలో రిజర్వేషన్ పోందాలంటే నిబందనలను పాటించాల్సిందేనని కోర్టు తెలిపింది.
Also Read: 30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!