E-Paper
Advertisement

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!
Advertisement

WhatsApp Guest Calls: సాధారణంగా మనం ఎవరికైనా వాట్సప్ కాల్ చేయాలన్నా, లేదా గ్రూప్ కాల్‌లో మాట్లాడాలన్నా మన ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ ఉండి తీరాల్సిందే. ఒకవేళ అవతలి వాళ్లకు వాట్సప్ లేకపోతే మనం వేరే యాప్స్‌ని వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ టెన్షన్ ఉండదండోయ్. మనందరం మెచ్చిన వాట్సప్ త్వరలోనే ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. దీని ద్వారా వాట్సప్ అకౌంట్ లేని వాళ్లు కూడా నేరుగా లింక్ క్లిక్ చేసి కాల్‌లో జాయిన్ అయిపోవచ్చు.

ఈ గెస్ట్ కాల్స్ ఎలా పనిచేస్తాయి?

వాట్సప్‌లోని కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి ఎప్పటిలాగే ఒక కాల్ లింక్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ లింక్‌ను మీ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌కు షేర్ చేయొచ్చు. వాళ్లకు వాట్సప్ యాప్ లేకపోయినా, అకౌంట్ లేకపోయినా పర్వాలేదు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు.. నేరుగా వెబ్ బ్రౌజర్‌లోనే వాట్సప్ వెబ్ ద్వారా కాల్ ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకునే పని లేకుండా క్షణాల్లో కాల్‌లో మాట్లాడొచ్చు.

Advertisement

Also Read: సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

హోస్ట్‌లకూ పూర్తి కంట్రోల్:

ఎవరుపడితే వారు లింక్ ద్వారా కాల్ జాయిన్ అవుతారనే టెన్షన్ కూడా అవసరం లేదు. ఈ ఫీచర్‌లో హోస్ట్‌కు పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా గెస్ట్ లింక్ ద్వారా కాల్‌లోకి రావడానికి ట్రై చేస్తే.. ముందుగా హోస్ట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. హోస్ట్ ఓకే అంటేనే వాళ్లు కాల్‌లో జాయిన్ అవ్వగలరు. ఒకవేళ ఎవరైనా అనవసరంగా డిస్టర్బ్ చేస్తే వాళ్లను మధ్యలోనే తొలగించే హక్కు కూడా హోస్ట్‌కే ఉంటుంది. పెద్ద మీటింగ్స్ లేదా ఫ్యామిలీ డిస్కర్షన్స్ జరిగేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

ప్రైవసీకి ఎలాంటి ఢోకా లేదు:

Advertisement

కొత్త ఫీచర్ వస్తోంది కదా.. సెక్యూరిటీ మాటేంటి అని కంగారుపడాల్సిన పనిలేదు. వాట్సప్ చెబుతున్న దాని ప్రకారం ఈ గెస్ట్ కాల్స్‌కి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. అంటే మీ మాటలు చాలా సేఫ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఇంకా బీటా టెస్టర్లకూ రాలేదు. త్వరలోనే అధికారికంగా ఇది అందుబాటులోకి వస్తే మాత్రం జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌కి వాట్సప్ గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ హ్యారీ పాటర్ ఫోన్ టీజర్.. డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!

స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

Big Stories

Advertisement
×