Electricity pole numbers: ప్రతిరోజూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితం కరెంట్‌తోనే ముడిపడి ఉంది. ఫోన్ ఛార్జింగ్ కావాలన్నా.. ఫ్యాన్ తిరగాలన్నా, ఇంట్లోని ఇతర పనులు చేసుకోవాలన్నా కరెంట్ ఎంతో అవసరం. అయితే వర్షా కాలంలో లేదా సాధారణ రోజుల్లో అప్పుడప్పుడు కరెంట్ పోవడం, వైర్లు తెగిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ కావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మనం వెంటనే.. కరెంట్ ఆఫీస్‌కు లేదా హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాం. ఇలాంటి సమయంలో మనం లొకేషన్ సరిగ్గా చెప్పలేక ఎలక్ట్రిసిటీ సిబ్బంది రాక గంటల తరబడి ఇబ్బంది పడుతుంటాం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ప్రతి కరెంట్ స్తంభంపై కొన్ని ప్రత్యేకమైన నంబర్లు, కోడ్స్ రాసి ఉంటాయి. ఇంతకీ ఈ నంబర్లు దేనికి సంకేతం, వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామంది రోడ్లపై నడుస్తున్నప్పుడు లేదా ఇళ్ల ఎదురుగా ఉన్న కరెంట్ పోల్స్‌పై తెల్లటి లేదా పసుపు రంగు పెయింట్‌తో కొన్ని నంబర్లు, బార్ కోడ్స్ ఉండటాన్ని చూసే ఉంటాం. చాలా మంది వాటిని ఎవరో ఏదో రాశారని లైట్ తీసుకుంటారు. కానీ అవి కేవలం సాధారణ నంబర్లు కావు. ఆయా కరెంట్ శాఖల అధికారులకు మీ ప్రాంతం ఎక్కడ ఉందో కచ్చితంగా చెప్పే జియో-ట్యాగింగ్ నంబర్లు అవి. మీరు మీ ఏరియాలో కరెంట్ లేదని కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆ పోల్ నంబర్ చెప్తే చాలు.. అధికారులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా ఆ లొకేషన్‌కు చేరుకుంటారు.
సాధారణంగా నగరాల్లో.. గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బోర్డు వారు ప్రతి పోల్‌కు ఒక యూనిక్ ఐడీ లేదా సీరియల్ నంబర్‌ను కేటాయిస్తారు. దీని వల్ల ఏ స్తంభంపై ఉన్న లైట్ పాడైపోయింది, ఏ ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ కట్ అయింది అనే విషయాలు ఆఫీస్‌లో కూర్చునే కంప్యూటర్ ద్వారా కనిపెట్టొచ్చు. మనం ఫోన్ చేసి “మా ఇంటి దగ్గర కరెంట్ పోయింది” అని చెప్పడం కంటే.. “మా స్ట్రీట్‌లోని పోల్ నంబర్ 4528 దగ్గర వైర్ తెగిపడింది” అని కచ్చితంగా.. చెప్తే ఆటో మేటిక్‌గా సిబ్బంది అలర్ట్ అవుతారు. దీని వల్ల కంప్లైంట్ తీసుకోవడం నుంచి సమస్య పరిష్కారం కావడం వరకు ప్రతిదీ చాలా వేగంగా జరుగుతుంది.
Also Read: జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్
అలాగే.. అత్యవసర సమయాల్లో.. అంటే ఎక్కువగా.. వర్షాలు పడుతున్నప్పుడు చెట్లు విరిగి కరెంట్ తీగలపై.. పడినప్పుడు లేదా స్పార్కింగ్ అవుతున్నప్పుడు ప్రాణ నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ పోల్ నంబర్లు ఎంతగానో సహాయ పడతాయి. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన వెంటనే ఈ నంబర్ చెప్తే జీపీఎస్ లేదా మ్యాపింగ్ ద్వారా టెక్నీషియన్లు.. క్షణాల్లో ఆ ప్రాంతాన్ని ట్రేస్ చేయగలరు. అందుకే మీ ఇంటికి దగ్గరగా ఉన్న కరెంట్ స్తంభం నంబర్‌ను ఎప్పుడైనా ఫోటో తీసి ఉంచుకోవడం లేదా గుర్తు పెట్టుకోవడం చాలా మంచి అలవాటు.
చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మన ఇళ్లల్లో వాడే కరెంట్ మీటర్ల దగ్గర నుంచి మెయిన్ సప్లై వరకు ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. కరెంట్ బిల్స్ చెల్లించడం దగ్గర నుంచి కొత్త కనెక్షన్ల వరకు అన్ని ఆన్‌లైన్ అయినట్లే.. కంప్లైంట్స్ కూడా ఇప్పుడు డిజిటలైజ్ అయ్యాయి. కాబట్టి ఇకపై మీ ప్రాంతంలో ఎలాంటి కరెంట్ సమస్య ఉన్నా, కంగారుపడకుండా మీ దగ్గర్లోని కరెంట్ పోల్ నంబర్‌ను నోట్ చేసుకొని అధికారులకు ఫిర్యాదు చేయండి. తద్వారా మీ సమస్య నిమిషాల వ్యవధిలో పరిష్కారమవుతుంది. మీ విలువైన సమయం కూడా ఆదా అవుతుంది.