iPhone 17 Price Hike: మీరు కూడా త్వరలో ఐఫోన్ 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్. సాధారణంగా కొత్త మోడల్ వచ్చాకే పాత ఫోన్ల రేట్లు మారుతుంటాయి, కానీ ఈసారి యాపిల్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది. వచ్చే రెండు రోజుల్లోనే iPone 17 సిరీస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. గ్లోబల్‌గా పెరిగిన తయారీ ఖర్చులే ఇందుకు కారణమట. ఒకవేళ మీరు కూడా ఈ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే.. ఆగస్టు 10న కొత్త రేట్లు అమల్లోకి రాకముందే కొనుగోలు చేసేయడం ఉత్తమం.
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలను పెంచేందుకు యాపిల్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కొత్త లీక్‌లు చెప్తున్నాయి. సాధారణంగా వచ్చే నెలల్లో రాబోయే iPhone 18 Pro లాంచ్ తర్వాత ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ, అంతకంటే ముందే అంటే ఆగస్టు 10 నాటికే ధరల పెంపు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read: BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!
సాధారణంగా యాపిల్ నుంచి ఒక ఫోన్ మార్కెట్‌లోకి వచ్చాక.. మోడల్ సైకిల్ మధ్యలో ధరలు పెంచడం చాలా అరుదు. అయితే మెమరీ, స్టోరేజ్ కాంపోనెంట్ల తయారీ ఖర్చులు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పెరిగిన ఖర్చులను కంపెనీ ఇకపై సొంతంగా భరించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ లీకర్ సమాచారం ప్రకారం.. గ్లోబల్ మార్కెట్‌లో ఈ పెంపు సుమారు 74 డాలర్ల వరకు ఉండొచ్చు. మన భారత్‌లో పన్నులు, కరెన్సీ మార్పిడి విలువను బట్టి చూస్తే.. iPhone 17 సిరీస్ ఫోన్లపై దాదాపు రూ.10,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
ఏయే మోడళ్లపై ఎంత ఖచ్చితంగా పెరుగుతుందనే దానిపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ మీరు కూడా ఐఫోన్ 17 కొనాలని ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం.. ఈ లీక్స్ నిజమయ్యే లోపే పాత ధరకు కొనుగోలు చేయడం మంచిది.
Also Read: ఇది కదా అసలైన ఫోల్డబుల్ ఫోన్ అంటే.. శాంసంగ్‌ను మించిపోయేలా Xiaomi కొత్త ప్లాన్!