E-Paper
Advertisement

రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఎందుకు?.. అసలు నిజం బయటపెట్టిన డీజీపీ!

రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఎందుకు?.. అసలు నిజం బయటపెట్టిన డీజీపీ!
Advertisement

DGP Anand: వరంగల్ నిట్ ప్రాంగణంలో పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ వచ్చిన ఆయన, పోలీసు వ్యవస్థ పనితీరుతో పాటు ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఐపీఎస్ శిక్షణ ఇక్కడే జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పటి నక్సలైట్ల భయాలు, కూంబింగ్ ఆపరేషన్ల నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

నక్సలిజం అంతర్థానం

Advertisement

రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా సమసిపోయిందని డీజీపీ స్పష్టం చేశారు. కీలక నేతలు, క్యాడర్ లొంగిపోవడంతో ఇప్పుడు వారి రీహాబిలిటేషన్ పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం లొంగిపోయిన వారికి పూర్తి సహాయం అందిస్తామన్నారు. అలాగే నక్సల్స్ దాడుల్లో మరణించిన బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ వీర్’ అనే ప్రత్యేక అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

అతిపెద్ద సవాళ్లు.. డ్రగ్స్, సైబర్ నేరాలు

Advertisement

ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ నేరాలే ప్రధాన సమస్యలుగా మారాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు ఏకంగా రూ.1,750 కోట్లు కోల్పోయారని, ముఖ్యంగా వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులే అధిక లాభాల ఆశతో మోసపోతున్నారని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి పట్టణాల నుంచి గ్రామాలకు, చివరకు పాఠశాలలకు కూడా వ్యాపించిందన్నారు. విద్యాసంస్థలు ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, త్వరలోనే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సెక్యూరిటీ ఉపసంహరణపై స్పష్టత

గతంలో నక్సల్స్ ముప్పు కారణంగా ప్రజాప్రతినిధులకు భారీగా భద్రత ఇచ్చామని, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడంతోనే సెక్యూరిటీని సమీక్షించి తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రజాధనం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నేరుగా తన సొంత భద్రతను కూడా తగ్గించుకున్నానని తెలిపారు. ఈ అంశాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని డీజీపీ కోరారు.

Also Read: కొత్త పింఛన్లపై రేవంత్ సర్కార్ కోతలు.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పింఛన్లు బంద్!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×