Upcoming Cars India 2026: భారత కార్ల మార్కెట్ లో పండుగ సీజన్ సందడి మొదలుకానుంది. కొత్త కార్ల కోసం ఎదురుచూస్తున్న వారికి వరుసగా కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. SUVలు, సెడాన్లు, హ్యాచ్ బ్యాక్ లతో కలిపి ఆరు కొత్త మోడళ్లు సెప్టెంబర్ నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ లాంటి కార్లు ఉన్నాయి.
ఆగస్టు 15న మహీంద్రా BE 6లో కొత్త స్పోర్టెక్ వేరియంట్‌ను పరిచయం చేయనుంది. ఈ టాప్ ఎండ్ ట్రిమ్‌లో XEV 9S, XEV 9e, XUV 7XO మోడళ్లలో కనిపించే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉండే అవకాశం ఉంది. బ్లాక్, టాన్ కలర్‌లతో డ్యూయల్ టోన్ థీమ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆగస్టు 18న కొత్త స్కోడా స్లావియా అవతార్‌ను పరిచయం చేయనుంది. ఇందులో బంపర్లు, గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్‌లో మార్పులు ఉండొచ్చు. కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్‌డేట్స్ రావచ్చు.
ఆగస్టు 26న ఎంజీ హెక్టర్ టోమాహాక్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది హెక్టర్ ప్లస్ కంటే పైస్థానంలో ఉండే మూడు వరుసల SUVగా రానుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని సమాచారం. మహీంద్రా XEV 9Sకు పోటీగా నిలిచే ఈ SUVలో భవిష్యత్తులో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా అందించే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 4న కియా సోరెంటో హైబ్రిడ్ ను భారత మార్కెట్లో తీసుకురానున్నట్లు సమాచారం. ఇది దేశంలో కియా నుంచి వచ్చే తొలి హైబ్రిడ్ మోడల్‌గా నిలవనుంది.
సెప్టెంబర్ మొదటి వారంలో మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, సవరించిన బంపర్లు, లోయర్ గ్రిల్, కొత్త అప్‌హోల్స్టరీ లాంటి డిజైన్ మార్పులు ఉండవచ్చు. మెకానికల్‌గా పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వస్తుందనే ప్రచారం జరుగుతున్నా, దీనిపై మారుతి నుంచి అధికారిక సమాచారం ఇంకా లేదు.
సెప్టెంబర్ చివర్లో రెండో తరం హ్యుందాయ్ బేయాన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మారుతి ఫ్రాంక్స్‌కు పోటీగా నిలవనుంది. యువతను ఆకట్టుకునే డిజైన్‌తో రానున్న ఈ మోడల్‌లో విడుదల తర్వాత CNG వేరియంట్‌ను కూడా తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే సెప్టెంబర్ నాటికి భారత కార్ల మార్కెట్లో కొత్త మోడళ్లతో పోటీ మరింత పెరగనుంది. ఎలక్ట్రిక్ SUV నుంచి హైబ్రిడ్ SUV, ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వరకు పలు ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి రాబోయే నెలల్లో బోలెడు ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: హ్యుందాయ్ ఈవీ To న్యూ నెక్సాన్.. 2027లో దుమ్మురేపనున్న కొత్త కాంపాక్ట్ SUVలు ఇవే!