E-Paper
Advertisement

స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్, 9000mAh భారీ బ్యాటరీ.. రెడ్‌మీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!

స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్, 9000mAh భారీ బ్యాటరీ.. రెడ్‌మీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!
Advertisement

Redmi Note 17: టెక్ ప్రియుల్లో రెడ్‌మీ నోట్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే ఈ సిరీస్ నుంచి త్వరలోనే ‘రెడ్‌మి నోట్ 17’ మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఈసారి షావోమి సంస్థ ఊహించని రేంజ్‌లో అప్‌గ్రేడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన లీకుల ప్రకారం.. ఈ సిరీస్‌లోని ఒక మోడల్‌లో ఏకంగా 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నారట. ఇప్పటివరకు ఏ మిడ్‌రేంజ్ ఫోన్లలోనూ చూడని విధంగా ఈ భారీ బ్యాటరీ అప్‌డేట్ ఉండబోతుండటంతో టెక్ వర్గాల్లో ఆసక్తి పెరిగిపోయింది.

డిస్‌ప్లే, స్పెసిఫికేషన్లు:

ఈ కొత్త రెడ్‌మీ నోట్ 17 ఫోన్ కేవలం బ్యాటరీ పరంగానే కాకుండా మిగతా ఫీచర్లలోనూ అదరగొట్టనుందని సమాచారం. దీనిలో ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ డిస్‌ప్లేను అందించనున్నారు. తద్వారా వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో పాటు ఎక్కువ వాల్యూమ్ అవుట్‌పుట్ ఇచ్చేలా ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇందులో అమర్చనున్నారు.

Advertisement

Also Read: ఇంత అద్భుతమైన డిజైన్‌కు.. ఆ ప్రైస్ ఏంటి సామీ? జూలై 7న నథింగ్ ఊచకోత ఖాయం!

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ చిప్‌సెట్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ కావచ్చు. ఈ కొత్త చిప్‌సెట్‌తో వచ్చే మొదటి స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ కూడా ఒకటని క్వాల్‌కామ్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల రోజువారీ వాడకంతో పాటు మల్టీటాస్కింగ్ కూడా ఈ ఫోన్‌ చాలా స్మూత్‌గా సాగుతుంది.

మెరుగైన మన్నిక:

Advertisement

సాధారణంగా పెద్ద బ్యాటరీ ఫోన్లు పడిపోతే దెబ్బతినే అవకాశం ఎక్కువ. అందుకే షావోమి ఈసారి మన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల తరహాలో దీనికి వాటర్ రెసిస్టెన్స్ (నీటి నుంచి రక్షణ) ఫీచర్‌ను ఇవ్వబోతున్నారు. అలాగే ఫోన్ కింద పడినా త్వరగా స్క్రీన్ పగలకుండా ఉండేలా డ్రాప్ ప్రొటెక్షన్‌ను మరింత మెరుగుపరిచినట్లు సమాచారం.

లాంచ్ ఎప్పుడంటే?

నిజానికి రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ నెలలో చైనాలో విడుదలవుతుంటాయి. ఈసారి కూడా అదే సమయానికి నోట్ 17 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్లు కొన్ని అంతర్జాతీయ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించడంతో.. చైనాలో విడుదలైన కొద్ది రోజులకే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద బ్యాటరీ వల్ల ఫోన్ బరువు, మందం కాస్త పెరిగే ఛాన్స్ ఉంది.

Also Read: 17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×