E-Paper
Advertisement

అదిరిపోయే అప్డేట్.. WhatsAppలో సీక్రెట్ ఓటింగ్, డెడ్‌లైన్ ఫీచర్స్.. ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే!

అదిరిపోయే అప్డేట్.. WhatsAppలో సీక్రెట్ ఓటింగ్, డెడ్‌లైన్ ఫీచర్స్.. ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే!
Advertisement

WhatsApp New Features: మనం రోజూ రకరకాల వాట్సప్ గ్రూపుల్లో ఉంటాం. ఫ్రెండ్స్, ఆఫీస్, ఫ్యామిలీ గ్రూప్‌లలో రోజూ వందల మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ముఖ్యమైన మెసేజ్‌లు చూడటం మర్చిపోతుంటాం. మరికొన్నిసార్లు గ్రూప్‌లో ఏదైనా విషయం గురించి పోల్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం తీసుకోవడం వలన.. మిగతావారిలో కాస్త గందరగోళం ఏర్పడుతుంటుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ వాట్సప్ కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

పోల్స్‌లో డెడ్‌లైన్, అనానిమస్ ఓటింగ్:

ఇప్పటివరకు గ్రూప్‌లో ఏదైనా ప్లాన్ కోసం పోల్ పెడితే అందరూ ఎప్పుడు పడితే అప్పుడు ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు పోల్‌కి ఒక సమయాన్ని (డెడ్‌లైన్) సెట్ చేయవచ్చు. ఆ టైమ్ పూర్తి కాగానే ఓటింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అలాగే, ఎవరు దేనికి ఓటు వేశారో ఇతరులకు తెలియకుండా ఉండేలా ‘అనానిమస్ ఓటింగ్’ ఆప్షన్ కూడా వచ్చింది. ఒకవేళ పోల్ క్రియేట్ చేశాక ఏమైనా తప్పులు ఉంటే.. పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు దాన్ని ఎడిట్ చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.

Advertisement

Also Read: నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

ఒకే టాగ్‌తో అందరికీ నోటిఫికేషన్:

గ్రూప్‌లో ఏదైనా అర్జెంట్ మెసేజ్ లేదా ముఖ్యమైన విలేకరుల సమావేశం, మీటింగ్ వివరాలు చెప్పాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరినీ విడివిడిగా టాగ్ చేయడం కష్టం. అందుకే ఇప్పుడు ‘@all’ అనే ఫీచర్ వచ్చింది. మీరు మెసేజ్‌లో @all అని టైప్ చేస్తే చాలు.. గ్రూప్‌లోని అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే పెద్ద గ్రూపుల్లో (32 మంది కంటే ఎక్కువ ఉన్నవాటిలో) స్పామ్ తగ్గించేందుకు ఈ ఆప్షన్ కేవలం అడ్మిన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త గ్రూప్ క్రియేషన్ మరింత ఈజీ:

Advertisement

ఒకే గ్రూప్‌లోని కొంతమంది సభ్యులతో కలిసి ఏదైనా ప్రత్యేకమైన ఈవెంట్ లేదా సైడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలనుకుంటే.. మళ్లీ పాత పద్ధతిలో అందరి కాంటాక్ట్స్ వెతికి యాడ్ చేయాల్సిన పనిలేదు. ఉన్న గ్రూప్ నుంచే మనకు కావలసిన వారిని సెలెక్ట్ చేసుకుని నేరుగా కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది టైమ్‌ని చాలా ఆదా చేస్తుంది.

త్వరలోనే అందరికీ అందుబాటులోకి:

ఈ కొత్త ఫీచర్లు ఇప్పటికే కొందరికి అందుబాటులోకి వచ్చాయి. రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్లు ఇంకా కనిపంచకపోతే.. మీ ఫోన్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకోండి. ఈ మార్పులతో వాట్సప్ గ్రూప్ చాటింగ్ ఇకపై మరింత సరదాగా మారనుంది.

Also Read: గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

Related News

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

Big Stories

Advertisement
×