E-Paper
Advertisement

Y43 మైక్రో SUV To ఎలక్ట్రిక్ MPV.. మారుతి వస్తున్న 4 క్రేజీ యుటిలిటీ వెహికల్స్ ఇవే!

Y43 మైక్రో SUV To ఎలక్ట్రిక్ MPV.. మారుతి వస్తున్న  4 క్రేజీ యుటిలిటీ వెహికల్స్ ఇవే!
Advertisement

Upcoming Maruti Cars 2026-27:  భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతి సుజుకి కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. వచ్చే రెండేళ్లలో రెండు SUVలు, రెండు MPVలు కలిపి నాలుగు కొత్త యుటిలిటీ వెహికల్స్ ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లతో పాటు ఈ కొత్త వాహనాల ద్వారా SUV, MPV విభాగాల్లో తన వాటాను పెంచుకోవాలని భావిస్తోంది.

Y43 మైక్రో SUV

Y43 కోడ్‌నేమ్‌తో వస్తున్న మైక్రో SUVపై ఆసక్తి నెలకొంది. ఇది ఫ్రాంక్స్ కంటే కింది స్థానంలో ఉండి, ప్రస్తుతం ఉన్న ఇగ్నిస్‌ కు ఆల్టర్నేట్ గా వచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ లాంటి కార్లకు ఇది పోటీగా నిలవనుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ SUV తరహా డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. Y43లో పెట్రోల్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్, CNG, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కూడా ఉండొచ్చని సమాచారం.  చిన్న SUV కోసం చూస్తున్న యువత, మొదటిసారి కారు కొనేవారిని లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Y177 సీట్ల SUV

Advertisement

మరోవైపు గ్రాండ్ విటారా ఆధారంగా 7 సీట్ల SUVని కూడా మారుతి సిద్ధం చేస్తోంది. Y17 అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఈ మోడల్ 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. పొడవైన వీల్‌ బేస్, మూడో వరుస సీట్లతో ఇది పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండేలా రూపొందించనున్నారు. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్, MG హెక్టర్ ప్లస్ లాంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. ఈ 7 సీటర్ SUVలో గ్రాండ్ విటారాలో ఉన్న 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది. CNG ఆప్షన్‌తో పాటు కొన్ని వేరియంట్లలో AWD కూడా అందించే అవకాశం ఉందని సమాచారం.

YMC7 సీటర్ ఎలక్ట్రిక్ MPV

ఇక YMC కోడ్‌నేమ్‌తో మారుతి కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ MPVని కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది కియా కేరెన్స్ క్లావిస్ EVకి పోటీగా రావచ్చు. 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇ-విటారా నుంచి బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ లాంటి కొన్ని సాంకేతిక అంశాలను తీసుకునే అవకాశం ఉంది. 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఆరు, ఏడు సీట్ల లేఅవుట్లలో ఇది అందుబాటులోకి రానుంది.

YDB చిన్న MPV

Advertisement

చివరిగా YDB కోడ్‌ నేమ్‌తో మరో చిన్న MPVపై మారుతి పనిచేస్తోంది. జపాన్‌లోని సుజుకి స్పేసియా ఆధారంగా రూపొందే ఈ మోడల్‌ను భారత అవసరాలకు అనుగుణంగా మార్చనున్నారు. 2027-28లో ఇది మార్కెట్లోకి రావచ్చని సమాచారం. మూడు వరుసల సీట్లతో వచ్చే ఈ MPVని నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

Read Also: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు.. థార్ రాక్స్‌ పై ఏకంగా రూ.1.20 లక్షల తగ్గింపు!

Tags

Related News

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

Big Stories

Advertisement
×