E-Paper
Advertisement

బ్యాచిలర్స్,చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..కేన్‌స్టార్ ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్

బ్యాచిలర్స్,చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..కేన్‌స్టార్ ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్
Advertisement

Kenstar 92 L Refrigerator: ఇంట్లో తక్కువ స్థలం ఉందా లేదా సింగిల్ రూమ్/హాస్టల్ గదిలో ఉంటున్నారా? అయితే.. మీకు కచ్చితంగా ఒక చిన్న ఫ్రిజ్ అవసరం ఉంటుంది. మార్కెట్లో.. అందుబాటులో ఉన్న బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్లలో కేన్‌స్టార్ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. తాజాగా కంపెనీ నుంచి వచ్చిన Kenstar 92 L Refrigerator మోడల్ తక్కువ బడ్జెట్‌లో లభించే అద్భుతమైన ఫ్రిజ్.బ్యాచిలర్స్, విద్యార్థులు లేదా చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేన్‌స్టార్ సంస్థ ఈ రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ కాంపాక్ట్ ఫ్రిజ్ మీ కిచెన్ లేదా రూమ్‌కు మోడ్రన్ లుక్‌ను అందిస్తుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Kenstar 92 L Refrigerator ఫీచర్లు:

1.డిజైన్, కెపాసిటీ:

Advertisement

ఈ కేన్‌స్టార్ రిఫ్రిజిరేటర్ స్టీల్ గ్రే కలర్ ఫినిషింగ్‌తో ఎంతో అట్రాక్టీవ్‌గా కనిపిస్తుంది. దీని మొత్తం కెపాసిటీ 92 లీటర్లు కాగా, సింగిల్ డోర్ డిజైన్‌తో వస్తుంది. ఇది చిన్న ప్రదేశాలలో లేదా రూంలలో కూడా సర్దుకోవడానికి పర్ఫెక్ట్ ఛాయిస్. రోజు వారీ కూరగాయలు, పాలు, పండ్లు, కూల్ డ్రింక్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ స్పేస్ సరిగ్గా సరిపోతుంది.

2.కూలింగ్ టెక్నాలజీ:

Advertisement

ఇది డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పని చేస్తుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఆహార పదార్థాలను తాజాగా ఉంచుతుంది. సింగిల్ స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తున్న ఈ ఫ్రిజ్ రోజువారీ కరెంట్ ఖర్చును కూడా ఆదా చేయడంలో సహకరిస్తుంది. అంతేకాకుండా.. స్టెబిలైజర్ లేకపోయినా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది వోల్టేజ్ మారే సమస్య ఉన్న ప్రాంతాల వారికి కూడా ఎంతో ఉపయోగ పడుతుంది. ఫ్రిజ్ లోపలి భాగంలో.. ఉన్న షెల్ఫ్‌లు గట్టిగా ఉండి ఎక్కువ బరువును కూడా మోయగలవు.

3.లో-వోల్టేజ్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ :

ఇళ్లలో తరచుగా జరిగే కరెంట్ వోల్టేజ్ సమస్యల నుంచి కంప్రెషర్‌ను రక్షించడానికి ఈ ఫ్రిజ్ సమర్థవంతంగా పని చేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా బాహ్య స్టెబిలైజర్ అవసరం లేకుండానే ఇది తక్కువ వోల్టేజ్‌లో కూడా సాఫీగా రన్ అవుతుంది.

Also Read: మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

4. కంపార్ట్‌మెంట్:

ఈ ఫ్రిజ్‌లో ప్రత్యేకంగా ఒక చిన్నకంపార్ట్‌మెంట్ అమర్చబడి ఉంటుంది. దీని వల్ల పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్ లేదా త్వరగా చల్లబడాల్సిన పదార్థాలను వేగంగా కూల్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న సైజు ఫ్రిజ్ అయినప్పటికీ ఈ ప్రత్యేక భాగం ఉండటం దీని ప్రధాన ప్లస్ పాయింట్.

5.ధర :

సాధారణంగా బ్రాండెడ్ ఫ్రిజ్‌లు అంటే.. వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అనుకుంటారు. కానీ.. ఈ మోడల్ మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. దీని అసలు ధర లేదా మార్కెట్ ధర కేవలం రూ. 9,290 మాత్రమే ఉంది. రూ.10 వేల లోపు బడ్జెట్‌లో ఒక మంచి ఫ్రిజ్ కొనాలని అనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. వివిధ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో.. ఈ మోడల్స్ పై ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లు లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగిన బడ్జెట్ ఫ్రిజ్ కావాలంటే.. ఈ కేన్‌స్టార్ మోడల్‌ను నిరభ్యంతరంగా కొనొచ్చు.

Related News

కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!

హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!

షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

Big Stories

Advertisement
×