E-Paper
Advertisement

రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!

రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!
Advertisement

Lava Smart 4: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా బ్రాండ్ల హవా నడుస్తున్న వేళ.. స్వదేశీ కంపెనీ లావా గట్టి పోటీకి సిద్ధమైంది. ఎలాంటి హంగామా లేకుండా, రోజువారీ వినియోగానికి ఏయే ఫీచర్లు కావాలో పక్కాగా ప్లాన్ చేసి Lava Smart 4 ను మన ముందుకు తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో రోజంతా వాడినా ఛార్జింగ్ అయిపోతుందనే బాధ లేకుండా ఉండాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. మరి ఈ ఫోన్ రేటు ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా..

ఈ Lava Smart 4 ఫోన్ మనదేశంలో ఒకే ఒక్క వేరియంట్‌లో లభిస్తుంది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. ఇది అజంతా గ్రే, కోణార్క్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా లోకల్ దుకాణాల్లో సులభమైన EMI ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. పైగా ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ ఇచ్చే సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

Advertisement

Also Read: ట్రావెలింగ్‌లో మీ ఫోన్ హ్యాక్ అవ్వకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఈ రూల్ పాటించండి!

Lava Smart 4 ఫోన్‌లో 6.56 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీంతో వీడియోలు చూడటానికి, బ్రౌజింగ్ చేయడానికి బాగుంటుంది. రోజువారీ సాధారణ వాడకానికి తగినట్లుగా యూనిసోక్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను దీనిలో వాడారు. మల్టీటాస్కింగ్ కోసం ప్రాసెస్ వేగాన్ని పెంచేలా మరో 3GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 గో వెర్షన్‌పై పనిచేస్తుంది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బడ్జెట్ ధరలోనే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. అంటే ఫోన్ అనుకోకుండా కిందపడినా త్వరగా తగలకుండా ఉండేలా డిజైన్ చేశారు.

రోజంతా హ్యాపీగా వాడుకోవడానికి వీలుగా Lava Smart 4లో 5,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని ఇచ్చారు. దీనికి టైప్-సి పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. రోజూవారీ అవసరాలకు, తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ హ్యాండ్ సెట్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

Also Read: ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×