E-Paper
Advertisement

మీ ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడూ కొత్త వాటిలాగే మెరవాలంటే..వాటిపై ఉన్న సింబల్స్ మిస్టరీ తెలియాల్సిందే!

మీ ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడూ కొత్త వాటిలాగే మెరవాలంటే..వాటిపై ఉన్న సింబల్స్ మిస్టరీ తెలియాల్సిందే!
Advertisement

Laundry care symbols meaning: మనం ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన బట్టలు కొన్నిసార్లు కేవలం రెండు మూడు వాష్‌లకే రంగు మారి పోవడం లేదా చిరిగి పోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం.. మనం వాటిని సరిగ్గా ఉతకకపోవడమే! కొత్త బట్టల లోపలి.. వైపు చిన్న లేబుల్ ఉంటుంది. అందులో కొన్ని రకాల గుర్తులు ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ పట్టించుకోం. కానీ.. బట్టలను ఎలా ఉతకాలి, ఎలా ఆర బెట్టాలి అనే సీక్రెట్ అంతా ఆ సింబల్స్‌లోనే ఉంటుంది. అవేంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

1. టబ్ సింబల్ – వాషింగ్ పద్ధతి:

బట్టల లేబుల్స్‌పై టబ్ ఆకారంలో ఉండే గుర్తు కనిపిస్తే.. అది వాషింగ్ మెషీన్ లేదా హ్యాండ్ వాష్‌కు సంబంధించినది. టబ్ కింద ఒక గీత ఉంటే..అది జెంటిల్ వాష్ చేయాలని అర్థం. టబ్ కింద రెండు గీతలు ఉంటే.. చాలా సున్నితంగా ఉతకాలి. ఒకవేళ టబ్ లోపల నంబర్ (ఉదాహరణకు 30°C లేదా 40°C) ఉంటే.. ఆ నీటి ఉష్ణోగ్రతలోనే బట్టలు ఉత కాలని అర్థం.ప్రస్తుతం మార్కెట్లో.. లభించే డిజిటల్ వాషింగ్ మెషీన్ల ధరలు సుమారు రూ.15,000 నుంచి రూ.35,000 వరకు ఉంటున్నాయి. వీటిలో టెంపరేచర్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

2. ట్రయాంగిల్ సింబల్ – బ్లీచింగ్:

Advertisement

త్రికోణం ఆకారంలో ఉండే గుర్తు బ్లీచ్ చేయడానికి సంబంధించినది. ట్రయాంగిల్ ఖాళీగా ఉంటే.. ఆ బట్టకు ఏ రకమైన బ్లీచ్ అయినా వాడొచ్చు. ట్రయాంగిల్ లోపల రెండు గీతలు ఉంటే.. నాన్-క్లోరిన్ బ్లీచ్ మాత్రమే వాడాలి. ట్రయాంగిల్ పై ఎక్స్ మార్క్ ఉంటే..అసలు బ్లీచ్ వాడ కూడదని అర్థం.ఈ రూల్ పాటించక పోతే మీ తెల్ల బట్టలు కూడా రంగు మారిపోతాయి.

Also Read: పవర్ కట్ అయినప్పుడు ఫ్రిజ్‌లో.. ఏ పదార్థాలు ఎన్ని గంటలు తాజాగా ఉంటాయో తెలుసా?

3. సర్కిల్ సింబల్ – డ్రై క్లీనింగ్:

Advertisement

వృత్తం ఆకారంలో ఉండే గుర్తు డ్రై క్లీనింగ్‌కు సూచన. సర్కిల్ లోపల ‘P’ లేదా ‘F’ అని అక్షరాలు ఉంటాయి. ఇవి లాండ్రీ షాప్ వాళ్లకి డ్రై క్లీనింగ్ ఏ కెమికల్స్‌తో చేయాలో సూచిస్తాయి.
సర్కిల్ పై ఎక్స్ (X) మార్క్ ఉంటే ఆ బట్టను డ్రై క్లీన్ చేయించ కూడదని అర్థం. సిల్క్, ఉన్ని క్లాత్ పై ఈ సింబల్స్ కచ్చితంగా ఉంటాయి.

4. స్క్వేర్ సింబల్ – డ్రైయింగ్ (ఆరబెట్టడం):

చతురస్రం ఆకారంలో ఉండే గుర్తు బట్టలను ఎలా ఆరబెట్టాలో చెబుతుంది. స్క్వేర్ లోపల ఒక చుక్క ఉంటే లో టెంపరేచర్‌లో డ్రై చేయాలి. స్క్వేర్ లోపల అర్ధ వృత్తం ఉంటే నీడలో లేదా తాడుపై ఆరబెట్టాలి. స్క్వేర్ పై ఎక్స్ మార్క్ ఉంటే మెషీన్‌లో పిండటం లేదా డ్రై చేయడం చేయ కూడదు. ఈ చిన్న చిన్న సింబల్స్‌ను అర్థం చేసుకుంటే.. మీ బట్టల లైఫ్ కాలం చాలా పెరుగుతుంది. ఖరీదైన బట్టలు పాడుచేసుకోకుండా ఉండాలంటే ఇకపై లేబుల్స్‌ను చెక్ చేయడం మర్చిపోకండి!

Related News

రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!

పాత గాడ్జెట్ బాక్సులు ఇంట్లో ఉన్నాయా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్టే!

ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?

నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!

పవర్ కట్ అయినప్పుడు ఫ్రిజ్‌లో.. ఏ పదార్థాలు ఎన్ని గంటలు తాజాగా ఉంటాయో తెలుసా?

రూ.17,999 ధరకే కేక పుట్టించే 5G టాబ్లెట్.. 8000mAh బ్యాటరీతో Ai+ NovaTab లాంచ్!

Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?

Big Stories

Advertisement
×