E-Paper
Advertisement

ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే! థియేటర్ ఫీలింగ్ ఇచ్చే టీవీ వచ్చేసిందోచ్!

ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే! థియేటర్ ఫీలింగ్ ఇచ్చే టీవీ వచ్చేసిందోచ్!
Advertisement

Mi 40 inch Full HD Smart TV: నేటి డిజిటల్ యుగంలో ప్రతీ ఇంట్లోనూ ఓ మంచి స్మార్ట్ టీవీ ఉండటం కామన్ అయిపోయింది. అయితే బడ్జెట్.. ధరలో థియేటర్ వంటి ఫీల్ ఇచ్చే టీవీల కోసం వెతుకుతున్నారా? మీ కోసమే Xiaomi తీసుకొచ్చిన Mi 40 Inches TV ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ. 21,299 ధరలో బెజెల్‌లెస్ డిస్‌ప్లే, కస్టమైజ్డ్ ప్యాచ్‌వాల్ , డోల్బీ ఆడియోతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. బెజెల్‌లెస్ డిజైన్ & పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీకి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ దీని డిస్ప్లే.మూడు వైపులా అంచులు చాలా సన్నగా ఉండటం వల్ల స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. అంతే కాకుండా దీని రెసొల్యూషన్‌తో పాటు ఇతర ప్రత్యేక ఫీచర్లు ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నా లేదా స్పోర్ట్స్ మ్యాచ్‌లు చూస్తున్నా ప్రతీ సీన్ చాలా క్లియర్‌గా ఉంటుంది.

2. సౌండ్ ఎక్స్‌పీరియన్స్:

Advertisement

విజువల్స్ ఎంత బాగున్నా సౌండ్ సరిగ్గా లేకపోతే.. ఆ మజానే వేరు. ఈ Mi 40 ఇంచ్ టీవీలో.. బెస్ట్ ఫీచర్లను అమర్చారు. దీనికి తోడు DTS-HD ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల డీప్ బేస్, స్పష్టమైన డైలాగ్స్ వినబడతాయి. అదనపు హోమ్ థియేటర్ లేదా సౌండ్‌బార్ లేకపోయినా చిన్న సైజు హాల్స్ లేదా బెడ్‌రూమ్‌కి ఈ ఆడియో అవుట్‌పుట్ సరి పోతుంది.

3. ఆండ్రాయిడ్ ఓఎస్ & గూగుల్ అసిస్టెంట్:

ఈ స్మార్ట్ టీవీ అధికారిక ఆన్ రాయిడ్ ఓఎస్ పై పనిచేస్తుంది. దీని వల్ల మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి YouTube, Netflix, Prime Video, Disney+ Hotstar, జనాదరణ పొందిన అనేక యాప్‌లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్న రిమోట్ వల్ల మీ వాయిస్‌తోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు లేదా మీ ఫేవరెట్ షోలను సెర్చ్ చేయవచ్చు.

4. ప్యాచ్‌వాల్ టెక్నాలజీ :

Advertisement

ఈ బ్రాండ్ మాత్రమే ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్ ఇందులో ఉంది. ఇది మీకు నచ్చే వివిధ రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లను వర్గీకరించి చూపిస్తుంది. పైగా మీ ఫోన్‌లోని ఫోటోలు లేదా వీడియోలను పెద్ద స్క్రీన్‌పై ప్లే చేయడానికి స్పెషల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: తక్కువ బడ్జెట్‌లో స్వచ్ఛమైన తాగునీరు! మిస్ కాకూడని టాప్ 5 ప్యూరిఫైయర్లు

5. ప్రాసెసర్, పోర్ట్‌లు, కనెక్టివిటీ:

ఈ టీవీలో 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAM,8GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్‌లు, పెన్ డ్రైవ్‌లను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీలు ఉంటాయి.

ధర,వారంటీ వివరాలు:

ధర: రూ.21,299 (వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంది).

వారంటీ: ప్రాడక్ట్‌పై 1 ఏడాది కంపెనీ వారంటీ , ప్యానెల్‌పై 2 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

మీరు రూ. 22,000 లోపు బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, మంచి బ్రాండ్ వ్యాల్యూ, అద్భుతమైన డిస్‌ప్లే , స్మార్ట్ ఫీచర్లు ఉన్న టీవీ కొనాలని అనుకుంటే ఈ టీవీ బెస్ట్ .

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×