E-Paper
Advertisement

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి
Advertisement

Loan repaid but bank not returning gold| బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలా మందికి అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. లోన్ మొత్తం చెల్లించిన వెంటనే తాకట్టు పెట్టిన బంగారం తిరిగి వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో బ్యాంక్ బంగారాన్ని వెంటనే తిరిగి ఇవ్వకపోవచ్చు. మీరు తీసుకున్న ఇతర రుణాలు, బాకీలు, రుణ ఒప్పందంలోని కొన్ని నిబంధనలు దీనికి కారణం కావచ్చు. అసలు రుణం చెల్లించేసినా బంగారం తిరిగి ఇవ్వకుండా ఉండే హక్కు బ్యాంకుకు ఎప్పుడు వస్తుంది? రుణగ్రహీతలు ఏ నిబంధనలను ముందుగానే పరిశీలించాలి? తెలుసుకుందాం.

గోల్డ్ లోన్ చెల్లించేసినా బంగారంపై బ్యాంక్‌కు ఇంకా హక్కు ఉంటుంది

గోల్డ్ లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించడం సాధారణంగా బంగారం విడుదలకు ముఖ్యమైన దశ. అయితే, అదే బ్యాంకులో మీకు ఇతర బాకీలు ఉంటే పరిస్థితి మారవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ బంగారంపై జనరల్ లియన్ హక్కును ఉపయోగించే అవకాశం ఉంది. భారత కాంట్రాక్ట్ చట్టం, 1872లోని సెక్షన్ 171 జనరల్ లియన్ గురించి ఉంది. కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలను నిలుపుకునే హక్కు కలిగి ఉన్నాయి. అయితే, రుణ ఒప్పందంలోని ప్రత్యేక నిబంధనల ప్రకారమే ఈ హక్కు ఉంటుంది.

జనరల్ లియన్ అంటే బంగారాన్ని బ్యాంక్ తన వద్ద ఉంచుకునే హక్కు

Advertisement

జనరల్ లియన్ అంటే కొన్ని బాకీలకు భద్రతగా బ్యాంక్ వద్ద ఉన్న ఆస్తిని నిలుపుకోవడం. ఈ హక్కు ప్రతి రుణగ్రహీతకు, ప్రతి లోన్‌ని ఆటోమేటిక్‌గా వర్తించదు. రుణ పత్రాలు, ఒప్పంద నిబంధనలు దీన్ని నిర్ణయిస్తాయి. అందుకే బంగారాన్ని తాకట్టు పెట్టే ముందు ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవాలి.

గోల్డ్ లోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు

ఒక రుణగ్రహీత గోల్డ్ లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాడు. అయితే అతనికి మరో రుణానికి సంబంధించిన బాకీలు కూడా ఉన్నాయి. దీంతో బ్యాంక్ మొదట తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వలేదు.
ఆ వ్యక్తి మరో రుణానికి కో – అప్లికెంట్‌గా ఉన్నాడు. గోల్డ్ లోన్ పత్రాల్లో బంగారాన్ని ఇతర రుణాలకు కూడా భద్రతగా ఉపయోగించే నిబంధన ఉంది. ఈ నిబంధన గత, భవిష్యత్ రుణాలకు కూడా వర్తించేలా ఉంది. కేసు విచారణలో కోర్టు ఒప్పందంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుంది. తర్వాత అప్పీల్ సమయంలో ఇతర బాకీలు వసూలు చేసిన నాలుగు రోజుల్లో బంగారం విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

బ్యాంక్ మీ బంగారాన్ని ఎప్పుడు ఉంచుకోవచ్చో నిర్ణియించేంది రుణ ఒప్పందం

Advertisement

గోల్డ్ లోన్ కాకుండా ఇతర బాకీ.. చట్టపరంగా మీకు సంబంధించినదేనా అనేది ముఖ్యమైన విషయం. అలాగే మీ బంగారం ఇతర రుణాలకు భద్రతగా ఉండేందుకు మీరు అంగీకరించారా అనేది చూడాలి.
మీరు కో – బారోయర్ (మరొక వక్తి తీసుకున్న లోన్‌లో సహరుణగ్రహీత) లేదా గ్యారంటర్‌గా ఉన్న రుణాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఇతర వ్యక్తి బాకీ కోసం మీ బంగారాన్ని బ్యాంక్ ఉంచుకోలేదు

మీకు సంబంధం లేని వ్యక్తి బాకీ కోసం బ్యాంక్ సాధారణంగా మీ బంగారాన్ని నిలుపుకోలేదు. అలా చేయడానికి చట్టపరమైన లేదా ఒప్పందపరమైన ఆధారం ఉండాలి. అందుకే కో – బారోయర్, గ్యారంటర్‌గా సంతకం చేసే ముందు నిబంధనలు తెలుసుకోవాలి.

Also Read: నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి

బంగారం తాకట్టు పెట్టే ముందు ఈ నిబంధనలను తప్పక చూడాలి

జెనెరల్ లియన్ (General Lien), రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ (Right of Set – off) వంటి పదాలు ఒప్పందంలో ఉన్నాయా చూడండి. అలాగే ఇతర బాకీలు, భవిష్యత్ రుణాలు, గ్యారంటీ బాధ్యతల గురించి నిబంధనలు పరిశీలించండి.

Also Read: 40 ఏళ్ల వయసులో రూ.80 లక్షలు సేవింగ్స్.. రూ.1 లక్ష నెలజీతంతో ఇలా సాధ్యం

బ్యాంక్ బంగారం ఇవ్వకపోతే ముందుగా ఈ చర్యలు తీసుకోండి

ముందుగా బంగారం ఎందుకు ఇవ్వడం లేదో బ్యాంకు నుంచి లిఖితపూర్వకంగా జవాబు అడగండి. ఏ లోన్ కారణంగా బంగారాన్ని నిలుపుకున్నారో వివరాలు కోరండి. అవసరమైతే సంబంధిత రుణ పత్రాలు, తాకట్టు పత్రాల కాపీలు అడగండి. బ్యాంక్ ఫిర్యాదు పరిష్కార విధానాన్ని (bank’s grievance redressal mechanism) కూడా ఉపయోగించవచ్చు. 30 రోజుల్లో సరైన పరిష్కారం లభించకపోతే కస్టమర్లు రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ ను ఆశ్రయించవచ్చు. రుణ చెల్లింపు రసీదులు, లోన్ క్లోజర్ స్టేట్‌మెంట్, తాకట్టు రసీదులను భద్రంగా ఉంచండి.

Tags

Related News

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్.. నగదు విత్‌డ్రా పరిమితులు తొలగింపు, సమ్మెలో 7.5 లక్షల మంది

ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!

ఇల్లు ఖాళీ చేసాక ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? మీ డబ్బును తిరిగి పొందే సింపుల్ టిప్స్

చాక్లెట్ల పేరుతో ఆటపట్టించి.. ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్టులు.. ఈ బాస్ బంగారం బాబోయ్!

కిరోసిన్ దీపం వెలుగులో చదివి రూ.20 లక్షల సాలరీ జాబ్.. వ్యవసాయ కూలీ బిడ్డ ఐపిఎస్ ఆఫీసర్

Big Stories

Advertisement
×