E-Paper
Advertisement

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో
Advertisement

Crime Thriller OTT : సాధారణంగా ఓ బట్టల దుకాణంలో యువకుడు… రోజూ షాప్‌కు వెళ్లడం, కస్టమర్లతో మాట్లాడటం, తన పని తాను చేసుకోవడం… ఇంతకుమించి ఏం చేస్తాడు ? అలాంటి యువకుడి కుటుంబానికి బంగారం స్మగ్లింగ్‌తో సంబంధం ఉంటే… తరతరాలుగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారం అతడి జీవితంలోకి కూడా అడుగు పెడితే… తన కుటుంబ వారసత్వాన్ని స్వీకరించాలా, దానికి దూరంగా ఉండాలా అనే పరిస్థితి ఎదురైతే ? ఈ నేపథ్యంతో వచ్చిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘Khalifa The Ruler’. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చింది ? ఎక్కడ, ఎన్ని భాషల్లో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆమిర్ అలీ ఓ సాధారణ యువకుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం మామూలుగా ఉండదు. అతడి తాత మంబరక్కల్ అహ్మద్ అలీని అందరూ బాబా అని పిలుస్తారు. బంగారం స్మగ్లింగ్ ప్రపంచంలో పేరున్న వ్యక్తి. తరతరాలుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం కుటుంబానికి డబ్బు, పవర్ తీసుకొచ్ పెడుతుంది. అలాగే దాని వెనుక ప్రమాదాలు, శత్రుత్వాలు కూడా ఉంటాయి. ఆమిర్ తన కుటుంబ గతం నుంచి దూరంగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఆ వారసత్వం నుంచి పూర్తిగా తప్పించుకోవడం అంత సులభం కాదు. బాబా నిర్మించిన నెట్‌వర్క్ ‌లోని సంబంధాలు, వ్యాపార ప్రయోజనాలు, పాత లెక్కలు క్రమంగా ఆమిర్‌ ను తమవైపు లాగుతాయి.

Advertisement

కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి విషయం అతడి నిర్ణయాలపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఇదే సమయంలో ఆమిర్ జీవితంలో ఫిజా ప్రవేశిస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన అతడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ కుటుంబ వ్యాపారం చుట్టూ ఉన్న ప్రమాదాలు వారి వ్యక్తిగత జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. ఒకవైపు ప్రేమించిన వ్యక్తితో ప్రశాంతంగా జీవించాలనే కోరిక, మరోవైపు కుటుంబ వారసత్వం నుంచి వచ్చే బాధ్యతలు… ఆమిర్ ఈ రెండింటి మధ్య చిక్కుకుంటాడు.

బంగారం స్మగ్లింగ్ అనేది కేవలం వస్తువులను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే వ్యవహారం కాదు. దాని వెనుక డబ్బు, రహస్య మార్గాలు, నమ్మకద్రోహాలు, పోటీ నెట్‌వర్క్‌లు ఉంటాయి. ఈ ప్రపంచంలో నిలబడాలంటే ఆమిర్ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అతడి ఎదుగుదలతో పాటు కుటుంబానికి ఉన్న శత్రుత్వాలు మరింత ప్రమాదకరంగా మారుతాయి. అతడు తీసుకునే ప్రతి అడుగు తన కుటుంబ భద్రతను ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

ఆమిర్ తన తాత సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొంటాడు ? దాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటాడా ? లేక ఆ ప్రపంచం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాడా ? కుటుంబం కోసం పోరాడే క్రమంలో అతడు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది ? ఫిజాతో అతడి బంధం ఈ ప్రమాదాల మధ్య నిలబడగలదా ? ఈ ప్రశ్నలకు యాక్షన్, ఎమోషన్‌తో సమాధానం చెప్పే ప్రయత్నమే ‘ఖలీఫా’.

Also Read : హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

5 భాషల్లో స్ట్రీమింగ్

‘ఖలీఫా ది రూలర్’కు వైశాఖ్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమిర్ అలీగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, మాలవిక శర్మ, షమ్మీ తిలకన్, రేణ్జీ పణిక్కర్, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. మోహన్‌లాల్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమా 2026 ఆగస్టు 20న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి Prime Video, Lionsgate Play, ManoramaMAX, Simply South, Aha Video, Starzplay వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి.

Related News

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×