E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!
Advertisement

iPhone 18 Pro: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై యాపిల్ లవర్స్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఇటీవల జరిగిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్‌లో యాపిల్.. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రకటించడంతో.. ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ప్రీ-ఆర్డర్లకు క్యూ కట్టారు.

అయితే మొదటి రోజుల్లోనే ప్రీ-ఆర్డర్ చేసిన వారికి ఫోన్లు అనుకున్న సమయానికే అందే అవకాశం ఉండగా.. ఇప్పటివరకు ఆర్డర్ చేయని వారికి మాత్రం కాస్త నిరాశ తప్పేలా లేదు. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పటికే డెలివరీ టైమ్‌లైన్స్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలోనూ కొత్తగా బుక్ చేసుకునే కస్టమర్లకు డెలివరీ తేదీలు అక్టోబర్‌కు మారుతున్నాయి. దీంతో ఫోన్‌ను ఇప్పుడే కొనాలనుకునే వారు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్‌లో ఫ్యాన్స్ వెయిటింగ్:

Advertisement

ఇండియాలో ఐఫోన్ 18 ప్రో కోసం డిమాండ్ ఏ స్థాయిలో ఉందో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం కొత్తగా బుక్ చేసుకుంటే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 మధ్య డెలివరీ చూపిస్తోంది. కలర్ లేదా స్టోరేజ్ వేరియంట్ మార్చినా పెద్దగా తేడా కనిపించడం లేదు.

Also Read: ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే ఇలా స్పేస్ పెంచుకోండి!

Pro Maxకి భారీ డిమాండ్:

Advertisement

ఐఫోన్ 18 ప్రో మాక్స్ పరిస్థితి అయితే మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ మోడల్‌ను ఇప్పుడు ఆర్డర్ చేస్తే అక్టోబర్ 6 నుంచి 11 మధ్య డెలివరీ వచ్చేలా టైమ్‌లైన్ కనిపిస్తోంది. అంటే.. సెప్టెంబర్ 18 నుంచి దాదాపు నెల రోజుల వరకు వేచి చూడాల్సిందే.

అమెరికాలోనూ అదే సీన్:

ఇండియాలోనే కాదు.. అమెరికాలోనూ ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు డిమాండ్ పీక్స్‌లో ఉంది. యూఎస్ యాపిల్ స్టోర్‌లో ప్రో మోడల్‌కు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు డెలివరీ విండో ఉంది. ప్రో మాక్స్‌కు మాత్రం అక్టోబర్ 6 నుంచి 13 వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది.

హాట్ టాపిక్‌గా ధరలు:

ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ.1,64,900 నుంచి, ప్రో మాక్స్ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతోంది. 256GB నుంచి ఏకంగా 2TB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. బర్గండి, గ్లేసియర్, సిల్వర్, బ్లాక్ కలర్లలో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. డిమాండ్ ఇంతలా ఉన్న నేపథ్యంలో.. కొత్త ఐఫోన్ కావాలనుకునేవారు ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోవడం మంచిది.

Also Read: కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే ఇలా స్పేస్ పెంచుకోండి!

రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

Big Stories

Advertisement
×