Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ వచ్చేశాయి. విద్యార్థులు, బడ్జెట్ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోరుకునే వారి కోసం ప్రైమ్‌బుక్ సంస్థ సరికొత్త సేల్ ఆఫర్లను ప్రకటించింది. ప్రైమ్‌బుక్ జనరేషన్ 2, జనరేషన్ 3 ల్యాప్‌టాప్‌లపై దాదాపు రూ.3000 వరకు నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కూడా తోడైతే.. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. రూ.23,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ల ఫీచర్లు, ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
తక్కువ బడ్జెట్‌లో కాంపాక్ట్ ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ప్రైమ్‌బుక్ 2 నియో మంచి ఆప్షన్. 11.6 ఇంచుల డిస్ప్లే, మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్ సేల్‌లో రూ.23,990కే లభిస్తుంది. ఇక కాస్త పెద్ద స్క్రీన్ కోరుకునే వారి కోసం 14.1 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే ఉన్న ప్రైమ్‌బుక్ 2 ప్రో మోడల్ రూ.26,990కి అందుబాటులో ఉంది. ఇందులో 8GB ర్యామ్‌తో పాటు 14 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే 60.3Wh బ్యాటరీని అందించారు.
Also Read: ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ‘హెపా ఫిల్టర్’ లేకపోతే.. ఎంత డబ్బు పెట్టి కొన్నా వేస్టే!
ఎక్కువగా సినిమాలు చూడటానికి లేదా ఆన్‌లైన్ క్లాసుల కోసం పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్ శ్రేణి సరిపోతుంది. 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే, 8GB ర్యామ్‌తో వచ్చే ఈ మోడల్స్ 128GB, 256GB ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో 128GB వేరియంట్ రూ.27,990 కి లభిస్తుండగా.. 256GB వేరియంట్ రూ.30,490కి దొరుకుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్ పెంచుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది.
లేటెస్ట్ టెక్నాలజీ ఇష్టపడే వారి కోసం ప్రైమ్‌బుక్ 3 మ్యాక్స్ అందుబాటులోకి వచ్చింది. రూ.33,490 నుండి రూ.33,990 మధ్యలో లభించే ఈ ల్యాప్‌టాప్‌లో మీడియాటెక్ జెనియో 720 ప్రాసెసర్, 8GB LPDDR5 ర్యామ్ ఉపయోగించారు. ఇందులో ప్రత్యేకంగా ఇచ్చిన ఎన్‌పీయూ (NPU) వల్ల ఆన్ డివైస్ ఏఐ ఫీచర్లు చాలా వేగంగా పనిచేస్తాయి. దీనితో పాటు వైఫై 6, 5 మెగాపిక్సెల్ వెబ్‌క్యామ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఆఫర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ వర్తిస్తాయి. అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,250 నుండి రూ.2,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,500 నుండి రూ.2,000 వరకు బ్యాంక్ ఆఫర్లు లభిస్తాయి. కాబట్టి.. ఆర్డర్ ఇచ్చే ముందు ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ ప్రయోజనం ఉందో చూసుకుని ల్యాప్‌టాప్ ఎంచుకోవడం మంచిది.
Also Read: మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!