E-Paper
Advertisement

Browse Extensions Malware: 40 లక్షల కంప్యూటర్లు హ్యాక్.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో ప్రమాదం.. ఈ జగ్రత్తలు పాటించండి

Browse Extensions Malware: 40 లక్షల కంప్యూటర్లు హ్యాక్.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో ప్రమాదం.. ఈ జగ్రత్తలు పాటించండి

Browse Extensions Malware| గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లలో ఉన్న కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌లు స్పైవేర్‌గా మారాయి. 40 లక్షలకు పైగా యూజర్లు ఈ మాల్వేర్ బారిన పడ్డారు. వారి కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఈ కొత్త మాల్వేర్ పేరు షేడీ పాండా (ShadyPanda). 2018 నుంచి ఈ ఎక్స్‌టెన్షన్స్ యూజర్లకు అందుబాటులో వచ్చాయి. కానీ 2023 నుంచి హ్యాకర్లు వీటికి హానికరమైన కోడ్ జోడించారు.

ఎలా మోసం చేశారు?

ఈ ఎక్స్‌టెన్షన్స్ వాల్‌పేపర్, ప్రొడక్టివిటీ టూల్స్ లాగా కనిపిస్తాయి. ఆటోమాటిక్ అప్‌డేట్‌ల ద్వారా హానికరమైన కోడ్ రహస్యంగా ఇన్‌స్టాల్ అయింది. ఫిషింగ్ లేదా మెసేజ్ లేకుండానే మాల్వేర్ వచ్చేస్తుంది.

ఎక్స్‌టెన్షన్స్ లో మాల్వేర్ తో హ్యాకర్లు ఏం చేశారంటే

యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీ చూడడం
పాస్‌వర్డ్స్, కుకీస్ దొంగిలించడం
మీరు టైప్ చేసే ప్రతి అక్షరం రికార్డ్ చేస్తున్నారు
లింకులు మార్చి యూజర్ల డబ్బు దోచుకోవడం
కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ద్వారా హ్యాకర్స్‌.. మీ కంప్యూటర్ ని పూర్తిగా వారి కంట్రోల్‌లో తీసుకుంటారు.

డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయగానే ఆగిపోతున్న ఎక్స్‌టెన్షన్స్

మీరు డెవలపర్ టూల్స్ తెరిస్తే ఈ ఎక్స్‌టెన్షన్స్ పనిచేయకుండా ఆగిపోతున్నాయి. అందుకే ఎక్కువ కాలం ఇందులో మాల్వేర్ ఉందనే విషయం గురించి ఎవరికీ అనుమానం రాలేదు.

ఏ ఎక్స్‌టెన్షన్స్ ప్రమాదంలో ఉన్నాయి?

క్రోమ్‌లో 20, ఎడ్జ్‌లో 125 ఎక్స్‌టెన్షన్స్ ప్రమాదకరం. వీటిలో ముఖ్యమైనవి: Clean Master, WeTab, Infinity V+. ఒక ఎక్స్‌టెన్షన్‌కి 30 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి!

గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏం చేశాయి?

గూగుల్ అన్ని ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్ తొలగించింది. మైక్రోసాఫ్ట్ కూడా ఎడ్జ్ స్టోర్ నుంచి తీసేసింది. కానీ కొన్ని ఇంకా యూజర్ల బ్రౌజర్‌లో ఉండే అవకాశం ఉంది. ఒఫేక్ డౌన్‌లోడ్స్ అయినా ప్రమాదం ఎక్కువే అని రిపోర్ట్.

యూజర్లు ఇలా చేయలి

వెంటనే సందేహాస్పద వాల్‌పేపర్, ప్రొడక్టివిటీ ఎక్స్‌టెన్షన్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి
ముఖ్యంగా Clean Master, WeTab, Infinity V+ లాంటి సందేహాస్పద ఎక్స్‌టెన్షన్స్ వెంటనే తొలగించండి
అన్ని వెబ్‌సైట్ పాస్‌వర్డ్స్ మార్చండి. పాస్‌వర్డ్ మేనేజర్ (LastPass, Bitwarden) ఉపయోగిస్తే బెటర్
మంచి యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేయండి (బ్రౌజర్ ప్రొటెక్షన్ ఉన్నది మాత్రమే)
కొత్త ఎక్స్‌టెన్షన్ పెట్టేముందు రివ్యూలు, పర్మిషన్స్ బాగా చూడండి
బ్రౌజర్‌లో ఎక్స్‌టెన్షన్స్ సంఖ్య తక్కువగా ఉంచండి

ఎక్స్‌టెన్షన్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా హానికరం అవ్వచ్చు. నెలకోసారి మీ ఎక్స్‌టెన్షన్స్ లిస్ట్ చెక్ చేసుకోండి. అవసరం లేనివి తొలగించండి. ఈ రోజు నుంచి మీ బ్రౌజర్‌ని సురక్షితంగా ఉంచుకోండి. ఒక్క క్లిక్‌తో ప్రైవసీ పోతుందని గుర్తుంచుకోండి!

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

Big Stories

×