Sanjay Manjrekar slams Abhishek Sharma: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ శర్మ మరోసారి అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 3 బంతుల్లో కేవలం 7 పరుగులే చేశాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అభిషేక్ శర్మ విఫలమైన తరుణంలోనే ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫ్లాట్ ట్రాక్స్‌పై తప్ప, విదేశీ పిచ్‌లపై ఇంకెప్పుడు ఆడతావ్ ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ మైదానాల్లో భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ, జపాన్ లో ఎందుకు ఆడటం లేదంటూ నిలదీశారు. దీనిపై ఇంకెప్పుడు సాధన చేస్తావ్ ? ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే… టీమిండియా నుంచి అభిషేక్ శర్మ మెడలు పట్టుకుని గెంటేస్తారని హెచ్చరించారు. భారత మైదానాలపై ఆడే అవకాశం నీకు రాదని గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీ మైదానంలో ఆడే వాడే రియల్ హీరో అని తెలిపారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం ఫ్లాట్ ట్రాక్స్‌పై హీరో అవుతున్నాడని, విదేశీ పిచ్ లపై జోరోగా మిగిలిపోతున్నాడని హేళన చేశారు సంజయ్ మంజ్రేకర్.
రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చారు. దీనిపై ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెనర్ గా రావాల్సిన సంజును అనవసరంగా ఫస్ట్ డౌన్ లో పంపారని మండిపడ్డారు. వైభవ్ సూర్యవంశీ లాంటి పిల్లబచ్చా గాడిని ఆడించేందుకు వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను బలి చేస్తారా ? అంటూ టీమిండియా మేనేజ్మెంట్ పై ఫైర్ అయ్యారు. ఇకనైనా ఈ ప్రయోగాలు మానుకోవాలని కోరారు. వైభవ్ సూర్యవంశీని ఆడించాలని భావిస్తే, అభిషేక్ శర్మను పక్కకు పెట్టాలని సూచనలు చేశారు. అలా చేస్తే అయినా అభిషేక్ శర్మ దారిలోకి వస్తాడని చురకలు అంటించారు. దీంతో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ జరుగగా, శ్రేయస్ అయ్యర్ సేన సూపర్ విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా నేరుగా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఇక అక్టోబర్ 3వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ జరుగనుంది. ఇందులో గెలిచిన టీమ్.. గోల్డ్ గెలుచుకుంటుంది. మ్యాచ్ రద్దైతే మాత్రం రెండు జట్లు పతకాన్ని పంచుకోవాలి.