E-Paper
Advertisement

రాజంపేటలో నల్లారి చాప్టర్ క్లోజ్? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదే!

రాజంపేటలో నల్లారి చాప్టర్ క్లోజ్? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదే!
Advertisement

Nallari Kiran: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎక్కడ? ఎన్నికల తరువాత నుంచి కన్పించుటలేదంటున్నారు రాజంపేట ఓటర్లు. అసలు ఆయన   యాక్టివ్‌ మోడ్‌లోనే ఉన్నారా? లైమ్‌లైట్‌లో ఉండొచ్చని  బీజేపీలోకి వెళ్తే అక్కడ  కూడా సైడ్‌లైన్‌ చేసేశారా?రాజంపేట బీజేపీ టికెట్‌ నల్లారి చేజారి..  ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ అల్లుడిని వరించబోతుందనే చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి పొలిటికల్‌ కెరీర్‌ అటకెక్కినట్టేనా ?

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  చిట్టచివరి ముఖ్యమంత్రి పొలిటికల్‌ కెరీర్‌ అటకెక్కినట్టేనా ?. ఇదీ కడప జిల్లా రాజంపేటలో  ఇప్పుడు నడుస్తోన్న చర్చ.రాష్ట్ర విభజన తరువాత నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెప్పారు. సొంతగా సమైక్యాంద్ర పార్టీ పెట్టారు.అది నల్లేరు మీద నడకకాదనే విషయం నిలకడ మీద తెలిసింది. చాన్నాళ్లు సైలెంట్‌ మోడ్‌లో  ఉన్నారు.  ఆపై రాజకీయాల్లోకి  రీ – ఎంట్రీ  ఇస్తూ బీజేపీలో చేరారు. స్టేట్‌లో కాదు  సెంట్రల్‌లో చక్రం తిప్పాలని రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఓటమి ఎదురైనా సరే మిథున్‌రెడ్డికి  గట్టి పోటీ ఇచ్చారనే టాక్‌ వచ్చింది .కానీ  ఎన్నికల తరువాత ఆయన నియోజకవర్గానికి అందుబాటులో లేరని రాజంపేట బీజేపీ క్యాడర్‌ గరమవుతున్నారు..

కంచుకోటగా మార్చుకోవాలనేది  బీజేపీ ప్లాన్‌..

Advertisement

ఏపీలో రాజంపేటను కంచుకోటగా మార్చుకోవాలనేది  బీజేపీ ప్లాన్‌.అందులో భాగంగానే 2019లో పురంధరేశ్వరి రాజంపేట నుంచి బరిలోకి దిగారు. నల్లారికి ఛాన్స్‌ ఇస్తే రాజంపేటలో బీజేపీ బలోపేతం అవుతుందని భావించారు. కానీ పార్టీకి ఓట్లు పెరిగినా సరే నల్లారి ఓటమి చెందడంతో హైకమాండ్‌ పునరాలోచనపడిందట.  రాజంపేటలో మరో అభ్యర్థి కోసం అన్వేషణ  మొదలుపెట్టిందనే ముచ్చట గుప్పుమంది.ఈ టైమ్ లో  కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ పేరు తెరపైకి వచ్చింది.

బీజేపీ రంగంలోకి సాయప్రతాప్ రెడ్డి అల్లుడు..

రాజంపేట నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సాయిప్రతాప్‌ రెడ్డి అల్లుడు సాయిలోకేష్‌ను  బీజేపీ రంగంలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది.  బీజేపీ బలమైన క్యాడర్‌తో పాటు సాయిప్రతాప్‌ రెడ్డి చరిష్మా కలిస్తే  రాజంపేటలో సాయిలోకేష్‌ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. మరి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి  మాటేంటి? గతం సరే  అసలు వర్తమానంలో ఆయన ఎక్కడున్నారు .రాజంపేటలో ఆయను రీ ప్లేస్‌ చేయాలని  బీజేపీ నిర్ణయిస్తే  నల్లారి వారి ఫ్యూచర్‌ పిక్చర్‌ ఏంటి? అనే చర్చ జరుగుతుంది. అసలు రాజంపేటలో  విషయంలో  బీజేపీ  మన్‌ కీ బాత్‌ ఏంటి? లోకల్‌ టాక్‌ను నిజం చేస్తూ  సాయిలోకేష్‌ను తెరపైకి తెస్తారా? లేదంటే  మళ్లో బోల్డ్‌ చేయడం సరికాదని నల్లారికే ఛాన్స్‌ ఇస్తారా?  వేచిచూడాలి.

Also Read: సింధూ జలాలపై పాక్ ప్రధాని పిచ్చి ప్రేలాపనలు.. షెహబాజ్ షరీఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Tags

Related News

శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!

ఏపీలో మొదలైన మరో కొత్త పొలిటికల్ వార్.. బలైపోతున్న నిరుద్యోగులు!

కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!

మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!

Big Stories

Advertisement
×