E-Paper
Advertisement

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!
Advertisement

School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ సిస్టమ్ ద్వారా పాలతో కూడిన అల్పాహార పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, బడుల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకం సమర్థవంతమైన నిర్వహణకు గానూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సమగ్ర విధివిధానాలు జారీ చేశారు.

హెచ్‌కేఎమ్ చారిటబుల్ ఫౌండేషన్..

ఈ పథకం కింద నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి హెచ్‌కేఎమ్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా, అక్షయపాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కిచెన్ల ఏర్పాటుకు అయ్యే పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వం, ఎన్జీవోలు సంయుక్తంగా భరిస్తాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఐదో తరగతి విద్యార్థి అల్పాహారానికి రూ. 11.50, ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థికి రూ. 13.50 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. పంపిణీ రోజున ప్రతి విద్యార్థికి పాల కోసం రూ. 1.08 అదనంగా ఇస్తారు. ఈ పథకానికి విజయ డెయిరీ పాలను సరఫరా చేయనున్నారు. అలాగే పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Also read: రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

పాఠశాలల్లో ప్రతిరోజూ రొటేషనల్ పద్ధతిలో ఉదయం పూట వేడివేడి అల్పాహారం అందిస్తారు. కాగా ప్రధానోపాధ్యాయులు మరుసటి రోజు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అంచనా వేసి, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల లోపు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇండెంట్ నమోదు చేయాల్సి ఉంటుంది. బిల్లులన్నీ ఆన్‌లైన్ విధానంలోనే ప్రాసెస్ చేస్తారు. స్వచ్ఛంద సంస్థలు ఉదయం 6:30 గంటల నుంచి 8:45 గంటల లోపు ఇన్సులేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలలో ఆహారాన్ని పాఠశాలలకు చేర్చాల్సి ఉంటుంది. విద్యార్థులందరూ ఉదయం 9:30 గంటల లోపే అల్పాహారం, పాలను పూర్తిగా ముగించేలా చూడాలి. పాఠశాలలకు వారానికి 3 రోజులు మాత్రమే పాలు పంపిణీ చేయనున్నారు. సగం బడులకు సోమ, బుధ, శుక్రవారాల్లో.. మిగిలిన బడులకు మంగళ, గురు, శనివారాల్లో పాలు ఇస్తారు. పాలు లేని రోజుల్లో ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రాగి జావ అందిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పథకాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Advertisement

Also Read: పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా!.. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మంత్రి ఉత్తమ్

Tags

Related News

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!

ఫలించిన పాలమూరు రైతుల పోరాటం.. జూరాల నుంచి సాగునీరు విడుదల!

పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా!.. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మంత్రి ఉత్తమ్

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

Big Stories

Advertisement
×