E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ లైఫ్ పెంచాలా? ఈ 5 తప్పులు ఈ రోజు నుంచే ఆపేయండి!

స్మార్ట్‌ఫోన్ లైఫ్ పెంచాలా? ఈ 5 తప్పులు ఈ రోజు నుంచే ఆపేయండి!
Advertisement

Smartphone lifespan tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగంలా మారిపోయింది.అయితే వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న మొబైల్ కొత్తలో ఎంత వేగంగా పని చేస్తుందో, కొద్ది రోజులు గడిచే సరికి అంతకంటే.. ఎక్కువగా స్లో అయిపోతుంది లేదా బ్యాటరీ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి కంపెనీల లోపంతో పాటు..మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లే ప్రధాన కారణం అని  నిపుణులు చెబుతున్నారు. అందుకే ఫోన్ పూర్తిగా పాడైపోయే.. వరకు ఆగకుండా.. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పోన్ విషయంలో మనకు తెలియకుండానే..  చేసే  5 పొరపాట్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1.రాత్రి అంతా ఛార్జింగ్:

చాలా మంది రాత్రి పడుకునే.. ముందు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి, ఉదయం తీస్తుంటారు. మోడర్న్ స్మార్ట్‌ ఫోన్లలో ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ.. ఫోన్ వంద శాతం ఛార్జ్‌ వద్దే ఉండటం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీ లైఫ్ వేగంగా తగ్గిపోతుంది. బ్యాటరీ ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే డూప్లికేట్ లేదా నాణ్యత లేని లోకల్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ ఓవర్‌హీట్ అయి మదర్‌బోర్డు దెబ్బతింటుంది.

2. అనవసరమైన యాప్స్ :

Advertisement

మనం వాడి వదిలేసిన యాప్స్‌ను రీసెంట్ యాప్స్ నుంచి తొలగించకుండా అలాగే వదిలేస్తుంటాం. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయా యాప్స్ ఇంటర్నెట్‌ను, ర్యామ్‌ను వాడుకుంటూనే.. ఉంటాయి. ఇది ప్రాసెసర్‌పై అదనపు భారాన్ని మోపి ఫోన్ వేడెక్కడానికి దారి తీస్తుంది. ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లియర్ చేయడం వల్ల ఫోన్ స్పీడ్ పెరగడంతో పాటు బ్యాటరీ కూడా ఆదా అవుతుంది.

3. మొబైల్ కవర్‌:

ఫోన్‌కు అందమైన కవర్ వేసుకోవడం మంచిదే కానీ.. నెలల తరబడి దానిని తీసి లోపల పేరుకుపోయిన ధూళిని శుభ్రం చేయకపోతే సమస్య వస్తుంది. ఫోన్ వాడేటప్పుడు లేదా ఛార్జ్ చేసేటప్పుడు వచ్చే వేడి ఆ కవర్ వల్ల బయటకుపోక ఫోన్ ఇన్‌టర్నల్ పార్ట్స్ వేడెక్కుతాయి. అలాగే ఎండలో నేరుగా ఫోన్‌ను ఉంచడం లేదా విపరీతమైన వేడి ప్రదేశాలలో వాడటం వల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Advertisement

Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్:

ఫోన్ నుంచి అప్‌డేట్ నోటిఫికేషన్ రాగానే ‘తర్వాత చేద్దాంలే’ అని వాయిదా వేస్తుంటాం. కంపెనీలు అందించే.. సెక్యూరిటీ ప్యాచులు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఫోన్ పని తీరును మెరుగు పరచడానికే కాకుండా, బగ్స్‌ను తొలగించడానికి చాలా ముఖ్యం. అప్‌డేట్‌లను లైట్ తీసుకోవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది.

5. స్టోరేజ్:

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను 100% నింపేయడం వల్ల ప్రాసెసర్ డేటాను ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది తలెత్తుతుంది. దీని వల్ల ఫోన్ విపరీతంగా స్లో అవుతుంది.ఎప్పుడూ కొంత స్పేస్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫోన్‌కు మంచి టెంపర్ గ్లాస్, బ్యాక్ కేస్ వాడకపోతే.. కింద పడినప్పుడు స్క్రీన్ పగిలిపోయి పెద్ద మొత్తంలో ఖర్చు వస్తుంది.

మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మన ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఆయుష్షును త్వరగా ముగిసేలా చేస్తాయి. ఈ రోజే మీ అలవాట్లను మార్చుకుని, మీ ఫోన్‌ను జాగ్రత్తగా కాపాడుకోండి. చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ ఫోన్ సంవత్సరాల తరబడి పని చేస్తుంది.

Also Read: ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×