E-Paper
Advertisement

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు, పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు, పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Telangana Police Recruitment: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం చేస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు వెంటనే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవడం మంచిది.

నోటిఫికేషన్ వివరాలు

Advertisement

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోలీస్‌, జైళ్ల శాఖ, ప్రత్యేక రక్షణ దళం, అలాగే ఫైర్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు

Advertisement

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 19న ఉదయం 8:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందే అప్లై చేసుకోవడం మంచిది.

పరీక్ష ఫీజు వివరాలు

పోస్టులను బట్టి పరీక్ష ఫీజును నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు ఫీజు రూ.600 , రూ.750గా నిర్ణయించారు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.1,200, రూ.1,500గా నియామక బోర్డు వెల్లడించింది.

మినహాయింపులు

ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫీజులో కొంత ఊరట కల్పించారు. నిబంధనల ప్రకారం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అదనపు పోస్టుపై రూ.50, అలాగే ఇతరులకు రూ.100 చొప్పున ఫీజు మినహాయింపు లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని సమయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read: కశ్మీర్‌లో ఘోరం.. పేరు అడిగి మరీ కాల్చిచంపిన ఉగ్రవాదులు.. మండిపడిన కాంగ్రెస్ అగ్రనేతలు!

Tags

Related News

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

Big Stories

Advertisement
×